Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Guppedantha Manasu: ఇంట్లో నుంచి బయటికి వెళ్లడానికి సిద్ధమైన దేవయాని..!

Guppedantha Manasu Feb 5 Episode Today : బుల్లితెరపై ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులకు రోజురోజుకీ మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మేడ పైన వసు లైట్ బెలూన్ ఎగర వేస్తూ ఉంటుంది. ఈలోపు అక్కడ రిషి కూడా వెళతాడు. అలా ఇద్దరు ఆ లైట్ బెలూన్ ఎగరేస్తారు.

devayani-is-ready-to-go-out-of-the-house-in-guppedantha-manasu

ఆ తర్వాత రిషి, డ్రెస్ విషయంలో నాకు ఎందుకు అబద్దం చెప్పావు అని వసుధార అని అడుగుతాడు. దానికి వసు మీరు ఏ విషయంలో కూడా కోపం తెచ్చుకొను అని మాట ఇచ్చారు అని అంటుంది. దానికి రిషి.. అందుకే కదా నిన్ను ఏమీ అనలేక పోతుంది అని అంటాడు. ఈలోగా అక్కడకు గౌతమ్ వస్తాడు. మీరిద్దరి ఇక్కడ ఏం చేస్తున్నారు రా.. అని అడుగుతాడు.

దానికి రిషి తనదైన శైలిలో వెటకారంగా సమాధానం చెబుతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి రిషి, వసులు ఇంటిలోకి వచ్చి పతంగులు ఎగరవేయడానికి గాలిపటాలు తయారు చేస్తూ ఉంటారు. ఈలోగా అక్కడకు గౌతమ్ ఒక డిఫరెంట్ గాలిపటం తో వచ్చి వసును మెప్పించడానికి బాగా హడావిడి చేస్తూ ఉంటాడు.

Advertisement

మరోవైపు జగతి ‘ఎన్నో ఏళ్ల తర్వాత ఈ ఇంట్లోకి అడుగు పెట్టాను’ అని మనసులో ఆలోచించుకుంటూ ఆనంద పడుతూ ఉంటుంది. ఈ లోపు జగతి దగ్గరకు దేవయాని వచ్చి ‘రిషి దయవల్ల నువ్వు ఇంట్లోకి వచ్చి పడ్డావు’ కానీ దీన్ని శాశ్వతంగా అనుకోకు జగతి అని అంటుంది. దానికి జగతి కూడా ప్రాణమే శాశ్వతం కానప్పుడు ఎవరు ఎవరికీ శాశ్వతం కాదు.

Guppedantha Manasu Feb 5 Episode Today : జగతిని ఇంట్లో నుంచి వెళ్లమన్న మహేంద్ర.. 

అని జగతి, దేవయానితో ఎదురు వాదం వేసుకుంటుంది. ఇక ఈ క్రమంలోనే దేవయాని తన మాటలతో జగతిను నిరుత్సాహ పరచాలని చూస్తుంది. కానీ జగతి ఈ మాటలకు ఈ మాత్రం కుంగిపోదు. ఆ తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి ఇంట్లో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మరోవైపు దేవయాని, రిషి ను గదిలోకి పిలిచి నేను ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అని చెబుతుంది.

దానికి రిషి ఎందుకు పెద్దమ్మ అని అడగగా.. ఈ ఇంట్లో పరాయి వాళ్ళు ఉంటే ఈ ఇల్లు నాది కాదేమో అని.. నువ్వు నా కొడుకు కాదేమో అని అనిపిస్తుంది అని చెబుతుంది. ఆ క్రమంలోనే దేవయాని, రిషిని కన్నింగ్ ప్రేమతో దగ్గరకు తీసుకుంటుంది. మరోవైపు మహేంద్ర కూడా జగతి లగేజ్ బ్యాగ్ ను తీసుకొని బయటికి వస్తాడు. మరి ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Read Also : Guppedantha Manasu : జగతి తెచ్చిన డ్రెస్ అంటూ దేవయాని పెట్టిన చిచ్చు.. కోపంలో రిషి!

Exit mobile version