Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Karthika Deepam : రుద్రాణి నెలబాకీ తీర్చిన వంటలక్క.. టెన్షన్‌లో డాక్టర్ బాబు!

Karthika Deepam

Karthika Deepam

Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రుద్రాణి బాబును తీసుకెళ్లినందుకు దీప ఏడ్చుకుంటూ కనీసం వడ్డీ అయినా కట్టడానికి ఇంట్లో పోపు డబ్బాలు మొత్తం వెతుకుతుంది. మరోవైపు రుద్రాణి రాక్షస ఆనందం పొందుతూ రాక్షసి లా నవ్వుతూ ఉంటుంది.ఆ తర్వాత దీప పనిచేసే హోటల్ ఓనర్ దగ్గరకి వచ్చి నాలుగు వేలు అప్పు అడుగుతుంది.

దానికి ఆ హోటల్ ఓనర్ ఏ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేయకుండా వెంటనే అప్పు ఇస్తాడు. ఆ తర్వాత కార్తీక్ కు రుద్రాణి బాబును ఎత్తుకు వెళ్లిన సంగతి తెలుస్తుంది. అది తెలిసిన కార్తీక్ రుద్రాణి ఇంటికి కోపంగా వెళతాడు. మరోవైపు దీప రుద్రాణి కి త్వరగా డబ్బులు కట్టి బాబుని తీసుకొని రావాలి అని మనసులో అనుకుంటూ వెళ్తుంది.

ఇంతలో కార్తీక్, రుద్రాణి ఇంటికి కోపంగా వెళ్తాడు. ఇంట్లోకి వెళ్లిన కార్తీక్ ‘రుద్రాణి అసలు నువ్వు మనిషివేనా’ అని అడుగుతాడు. ఆ మాటకు రుద్రాణి కార్తీక్ కు వెటకారంగా మర్యాదలు చేస్తూ, వడ్డీ చెల్లించి బాబు ని తీసుకు వెళ్ళండి అని చెబుతుంది. ఇక కార్తీక్ తిరిగి ఇంటికి వెళతాడు. ఆ తర్వాత రుద్రాణి దగ్గరికి దీప వచ్చి వడ్డీ డబ్బులు చెల్లిస్తుంది. ‘సరిగ్గా లెక్క పెట్టుకొండి రుద్రాణి గారు’ అని వెటకారంగా దీప చెబుతుంది.

Advertisement

అప్పు కట్టి బిడ్డను తీసుకుని వెళుతున్న దీపకు.. వచ్చే నెల లోపు మొత్తం డబ్బులు చెల్లించకపోతే బిడ్డతో సహా ఇంటిని కూడా జప్తు చేసుకుంటానని లేదంటే మీ ఇద్దరు పిల్లలను కూడా లాక్కుంటా అని వార్నింగ్ ఇస్తుంది. దానికి దీప, రుద్రాణి మీద ఓ రేంజ్ లో విరుచుకు పడుతుంది. మరోవైపు కార్తీక్ కూడ అదే హోటల్ ఓనర్ దగ్గరికి వెళ్లి అడ్వాన్స్ అడుగుతాడు.

దానికి ఆ హోటల్ ఓనర్ ఇంతకుముందు వంట మనిషి కూడా వచ్చి అడ్వాన్స్ తీసుకుని వెళ్ళింది అని చెబుతాడు. తరువాయి భాగంలో అడ్వాన్స్ తీసుకుని తిరిగి వెళుతున్న కార్తీక్ కు ఆ హోటల్ లో పని చేసేది ఒకవేళ దీపనా.. అని డౌట్ వస్తుంది. ఒకవేళ దీప అయితే రుద్రాణి కి డబ్బులు కట్టి బాబు ని ఇంటికి తీసుకు వస్తుంది. ఆ హోటల్లో పనిచేసే వంటమనిషి దీప కాకూడదు అని కార్తీక్ మనసులో కోరుకొని టెన్షన్ తో ఇంటికి వెళ్లి చూస్తాడు.

Read Also : Guppedantha Manasu : జగతిని కోరుకుంటున్న మహేంద్ర వర్మ.. పర్సనల్ విషయం అంటూ వసుతో ఓపెన్ అయిన రిషి!

Advertisement
Exit mobile version