Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Karthika Deepam Aug 16 Today Episode : డాక్టర్ బాబు ఇంటికి వెళ్లిన దీప.. అమెరికాకు వెళ్లాలి అనుకుంటున్నా సౌందర్య కుటుంబం..?

Karthika Deepam Aug 16 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీక దీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వారణాసి గతంలో జరిగింది మొత్తం వివరిస్తూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో దీప జరిగిన విషయాలను అన్ని తలచుకొని బాధపడుతూ ఉంటుంది. ప్రమాదం జరిగిన తర్వాత తనకోసం డాక్టర్ బాబు రాలేదని బాధపడుతూ ఉంటుంది. ఇందులోనే డాక్టర్ దీప దగ్గరికి వచ్చి కూల్ గా ఉండమని చెబుతూ ఏం జరిగింది అని మెల్ల మెల్లగా అడిగి తెలుసుకుంటాడు. అప్పుడు డాక్టర్ తో దీప మాట్లాడుతూ అన్న అని పిలుస్తుంది.

Deepa gets sheltered by the doctor in todays karthika deepam serial episode

Karthika Deepam Aug 16 Today Episode : అమెరికాకు వెళ్లాలి అనుకుంటున్నా సౌందర్య కుటుంబం..

అప్పుడు ఆ డాక్టర్ ఒకవేళ మీ భర్త చనిపోకపోయి ఉంటే ఈపాటికి మీ దగ్గరికి వచ్చేవాడు కదా అని అనగా అలా మాట్లాడకు అన్న అని అంటుంది. ఆ తర్వాత డాక్టర్ దీప ను పీల్చుకొని మార్చురీ రూమ్ కి వెళ్తాడు. అప్పుడు దీప కార్తీక్ తనతో మాట్లాడిన మాటలను గుర్తుతెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఒక డెడ్ బాడీ దగ్గర కార్తీక్ వేసుకున్న బూట్లు చూసి మరింత భయపడుతుంది.

ఆ తర్వాత డెడ్ బాడీని చూడగా అది తన డాక్టర్ బాబు కాదు అని తెలుస్తుంది. అప్పుడు కార్తీక్ చివరిగా తనతో మాట్లాడిన మాటలు అన్నీ గుర్తు తెచ్చుకుంటుంది దీప. ఆ తర్వాత దీప తన ఇంట్లో వాళ్లందర్నీ తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఉండగా ఆ డాక్టర్ తన ఇంటికి పిలుచుకొని వెళ్తాడు. మరొకవైపు సౌందర్య దంపతులు, హిమ కూర్చొని ఎమోషనల్ అవుతూ ఉంటారు.

Advertisement

అప్పుడు సౌందర్య మనం ఈ ఇంట్లో ఉండకూడదు ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది ఇక్కడ నుంచి అమెరికాకు వెళ్లి పోదాము అని అంటుంది. అందుకు హిమ మాత్రం అసలు ఒప్పుకోదు. సౌందర్య బలవంత పెట్టడంతో హిమ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. మరొకవైపు ఆ డాక్టర్ దీపను తన ఇంటికి తీసుకుని వెళ్లి తన తల్లికి నీ కూతుర్ని తీసుకొని వచ్చాను అనటంతో ఆ డాక్టర్ వాళ్ళ అమ్మ దీపం చూసి సంతోషపడుతూ దీపకు ధైర్యం చెబుతుంది.

Read Also : Karthika Deepam Aug 15 Today Episode : డాక్టర్ బాబు అంటూ ఏడుస్తున్న వంటలక్క.. ఆనందంలో సౌందర్య కుటుంబం..?

Advertisement
Exit mobile version