Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

WhatsApp: మీరు వాట్సాప్ వాడుతున్నారా.. అయితే ఈ 10 ఫీచర్స్ తెలుసుకోవాల్సిందే..?

WhatsApp: ప్రస్తుత జనరేషన్ లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆండ్రాయిడ్ ఫోన్ ను యూస్ చేస్తున్నారు. అయితే ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇప్పటికే వాట్సాప్ లో యూజర్స్ కోసం కొత్త కొత్త ఫీచర్ లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే వాట్సాప్ లో త్వరలోనే మరొక 10 టీచర్స్ ని అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Group admins: మామూలుగా వాట్సాప్ లో ఎవరు పంపిన మెసేజ్ లు వాళ్ళు డిలీట్ చేసుకునే ఆప్షన్ చాట్స్ లోనే కాకుండా గ్రూప్స్ లో కూడా ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సరికొత్తగా గ్రూప్ అడ్మిన్ లు ఆ గ్రూప్ లో ఉన్న ఏ మెసేజ్ అయినా డిలీట్ చేసే అవకాశం కల్పించ బోతున్నారు.

2-step verification: వాట్సాప్ లో సరికొత్తగా వాట్సాప్ డెస్క్ టాప్, వెబ్ లో లాగిన్ అవ్వడానికి స్టెప్ వెరిఫికేషన్ ఫీచర్ రాబోతోంది. అయితే ఇందుకోసం యూజర్స్ మొబైల్ కు వచ్చే ఆరు అంకెల కోడ్ ని ఎంటర్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది.

Advertisement

Message reactions: ఫేస్‌బుక్ మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్‌ లతో పాటు వాట్సాప్ లో కూడా ఏ మెసేజ్‌కైనా జస్ట్ ట్యాప్ చేసి హోల్డ్ చేసి రియాక్షన్ ఇచ్చే ఫీచర్ రాబోతోంది.

Animated emojis: వాట్సప్ ఆండ్రాయిడ్, యాపిల్ ఐఓఎస్ యూజర్లకు యానిమేటింగ్ హార్ట్ ఎమోజీస్ రిలీజ్ చేయనుంది. రెడ్ కలర్ హార్ట్‌కు యానిమేషన్ ఎఫెక్ట్స్ జోడించనుంది. త్వరలో మరిన్ని ఎమోజీస్‌కు కూడా యానిమేషన్ రానుంది.

Communities: వాట్సాప్ లో ఒక గ్రూపులో మరిన్ని గ్రూప్స్ క్రియేట్ చేయడానికి కమ్యూనిటీ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. ఈ ఫీచర్ వల్ల గ్రూప్ అడ్మిన్ లు ఈ ఫీచర్ తో తమ గ్రూప్ ను మరింత కంట్రోల్ చేయవచ్చు.

Advertisement

Search shortcut: మనకు ఎవరిదైనా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ లో భాగంగా సెర్చ్ షార్ట్ కట్ రానుంది. అయితే ఈ ఫీచర్ మనకు వీడియోకాల్ ఐకాన్ పక్కన కనిపిస్తుంది. అయితే ఈ ఫీచర్ వల్ల మనకు కావాల్సిన కాంటాక్ట్ లో ఇన్ఫర్మేషన్ ను తొందరగా తెలుసుకోవచ్చు.

WhatsApp status: వాట్సప్ స్టేటస్ విషయంలో ఇప్పటికే పలు రకాల ప్రైవసీ సెట్టింగ్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరిన్ని ప్రైవసీ సెట్టింగ్స్ అందుబాటులోకి రానున్నాయి. తమ స్టేటస్ ఎవరు చూడాలి అన్నది వాట్సప్ యూజర్లు నిర్ణయించు విధంగా సెట్టింగ్స్ చేయవచ్చు.

Preview: వాట్సప్‌లో డాక్యుమెంట్స్ రూపంలో వచ్చే వీడియోస్, ఇమేజెస్ ప్రివ్యూ చూడటానికి సరికొత్త ఫీచర్ రానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ లేదు. డౌన్‌లోడ్ చేసిన తర్వాతే వాటిని చూసే అవకాశం ఉంది.

Advertisement

Share: వాట్సప్‌లో ఫోటోను, వీడియోను రెండుసార్లు కాకుండా ఒకేసారి షేర్ చేయడంతో పాటు స్టేటస్ అప్‌డేట్ చేసే అవకాశం కల్పించనుంది వాట్సప్.

Voice calls: వాట్సప్ లో గ్రూప్ వాయిస్ కాల్స్‌కు సంబంధించిన డిజైన్‌ను మార్చబోతోంది వాట్సప్. గ్రూప్ కాల్స్‌లో వాయిస్ వేవ్ ఫామ్స్ కనిపించనున్నాయి.

Advertisement
Exit mobile version