Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

YS Bharathi : వైఎస్ విజయమ్మ రాజీనామాతో పార్టీలో మొదలైన కొత్త చర్చ.. వైఎస్ భారతి రాజకీయాలలోకి రానున్నారా?

YS Bharathi : వైసీపీ ప్లీనరీ సమావేశాలలో భాగంగా నేడు అనూహ్యమైన అనుకొని సంఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వైయస్ విజయమ్మ గౌరవ అధ్యక్షత పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి పార్టీ కోసం ఎంతో కృషి చేస్తున్న నేపథ్యంలో తన అవసరం తనకు ఎంతగానో ఉందని ఈ ప్లీనరీ సందర్భంగా తన రాజీనామాను ప్రకటించారు. ఈ విధంగా వైయస్ విజయమ్మ రాజీనామా ప్రకటించడంతో ఏపీ రాష్ట్ర రాజకీయాలలో కొత్త చర్చలు మొదలయ్యాయి.

YS Bharathi

గత ఎన్నికలలో భాగంగా జగన్ పార్టీకి మద్దతుగా తన కుటుంబ సభ్యులు తన సోదరి వైఎస్ షర్మిల, తన తల్లి విజయమ్మ ఎంతో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం వల్ల తన కూతురికి అండగా వైయస్ విజయమ్మ కూడా వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షత పదవికి రాజీనామా చేయడంతో జగన్ కి మద్దతుగా తన ఫ్యామిలీ నుంచి ఎవరు వస్తారు అనే చర్చ మొదలైంది. ఇకపోతే జగన్ సతీమణి వైయస్ భారతి ఇప్పటికే తన వ్యాపారాలను చూసుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు.

YS Bharathi :  వైఎస్ భారతి రాజకీయాలలోకి రానున్నారా.. 

ఇకపోతే వైయస్ భారతి ఇప్పటికీ రాజకీయాలలో పెద్దగా ఏమాత్రం ఆసక్తి చూపకుండా కేవలం తన వ్యాపారాలను చూసుకుంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే వచ్చే ఎన్నికలలో జగన్ పార్టీకి మద్దతుగా ఆయన పార్టీ తరఫున ప్రచారం చేయడానికి ఎవరు ఉండరు అందుకే రంగంలోకి వైయస్ భారతి దిగుతారని వార్తలు వినపడుతున్నాయి. ఇప్పటినుంచి ఈమె పార్టీ వ్యవహారాలు కూడా చూసుకుంటే వచ్చే ఎన్నికలలో ఈమె కీలకంగా మారనున్నారని అందుకే వైయస్ భారతి కే సరైన పదవి ఇస్తారని చాలామంది భావిస్తున్నారు. మరి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఈ చర్చలలో ఏది నిజమో తెలియాల్సి ఉంది. తన భర్తకు అండగా పార్టీకి మద్దతుగా భారతి రాజకీయాలలోకి వస్తారా లేకపోతే రాజకీయాలకు దూరంగా ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Read Also : YS Vijayamma : వైయస్సార్సీపీ గౌరవ అధ్యక్షత పదవికి రాజీనామా చేసిన వైయస్ విజయమ్మ.. వచ్చే ఎన్నికలలో కూడా జగనే ముఖ్యమంత్రి!

Exit mobile version