Health Tips: సాధారణంగా చెప్పులు లేకుండా నదిచేవారికి,ఎక్కువ సమయం నీటిలో తడవడం వల్ల, శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల అరికాళ్ళు చీలుతూ ఉంటాయి. సాధారణంగా ఇలా జరగటం వల్ల ఎటువంటి సమస్య ఉండదు. కానీ కొన్ని సందర్భాలలో సమస్య తీవ్రత పెరిగి అరికాళ్ల చీలి రక్త స్రావం జరుజుగుతుంది. అంతే కాకుండా నడవటానికి కూడా వీలు లేకుండా విపరీతంగా నొప్పి కలుగుతుంది. ఇలాంటిఈ సమస్యతో బాధపడే వారు కొన్ని చిట్కాలను ఉపయోగించి వారి సమస్యను నివారించవచ్చు.
కలబంద గుజ్జు అందానికి , ఆరోగ్యానికి మాత్రమే కాకుండా కాళ్ళ పగుళ్లు నివారణ కు కూడా బాగా ఉపయోగపడుతుంది.కాళ్ళ పగుళ్లు సమస్యతో బాధపడేవారు కాలనీ శుభ్రంగా కడుక్కొని కలబంద గుజ్జును పగుళ్ళు ఉన్నచోట పూసి మర్దనా చేయడం పగుళ్ళు సమస్య తగ్గడమే కాకుండా పాదాలు మృదువుగా తయారవుతాయి.
కాళ్ళ పగుళ్లు నివారణ లు అరటిపండు కూడా బాగా ఉపయోగపడుతుంది. బాగా పండిన అరటి పండు గుజ్జును పాదాలకు అంటించి పదిహేను నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం కలిపి పాదాలను శుభ్రం చేసుకోవడం వల్ల అరికాళ్ళ పగుళ్ళు సమస్య నివారించవచ్చు.