Thyroid Treatment: ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు వెంటాడుతున్న సమస్యలలో థైరాయిడ్ సమస్య ఒకటి. ఏ వయసులో అయినా ఈ థైరాయిడ్ రావచ్చు మరీ ముఖ్యంగా ఈ థైరాయిడ్ సమస్య స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్ అనేది మన శరీరంలో అయోడిన్ అసమతుల్యత కారణంగా లేదా వారసత్వంగా కూడా వ్యాపిస్తూ ఉంటుంది. ఈ విధంగా థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు నిత్యం మందులు వాడుతూ ఉండాలి.
హైపర్ థైరాయిడిజం అనే ఈ గ్రంథి ఎక్కువగా థైరాయిడ్ హార్మోన్ విడుదల చేయటం వల్ల, అదే విధంగా హైపో థైరాయిడిజం అనే ఈ గ్లాండ్ అవసరమైన థైరాయిడ్ హార్మోన్‌ని తగినంతగా ఉత్పత్తి చేయలేకపోయినప్పుడు థైరాయిడ్ మనకు సంక్రమిస్తుంది. ఇలా థైరాయిడ్ వ్యాధి సోకినప్పుడు ఆకలి వేసినప్పటికీ బరువు తగ్గడం, గుండె చప్పుడు అధికమవడం, గాయిటర్ ఉత్పత్తి చెందడం, నెలసరి సక్రమంగా రాకపోవడం, విరోచనాలు అధికంగా రావడం వంటి లక్షణాలు కనబడతాయి.