Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Marigold Flower Health Benefits : బంతి పూలు, ఆకులతో అనారోగ్య సమస్యలకు చెక్..! 

Marigold Flower Health Benefits : బంతి పూలు అనగానే మనందరం జనరల్‌గా అలంకరణకు సంబంధించినదని అనుకుంటాం. అది నిజమే. బంతిపూలను అలంకరించుకోవడానికి, పూజలకు ఉపయోగిస్తుంటారు. కాగా, ఆయుర్వేద పరంగానూ బంతి పూలు, ఆకులు చాలా ఉపయోగకరమైనవి. ఇందులోని ఔషధ గుణాలు మానవుడికి ఎంతో మేలు చేస్తాయి. వీటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక బంతి పువ్వు, ఆకులను దంచి రసంగా చేసుకని గాయాలు అయిన చోట అప్లై చేసి కట్టు కట్టినట్లయితే గాయాలు, పుండ్లు వెంటనే నయం అయిపోతాయి.

marigold flower health benefits telugu, You Must Know These Facts

ఇకపోతే శరీరంలో ఆయాసం ఉన్నవాళ్లు బంతి పూలను ఉపయోగించినట్లయితే చాలా చక్కటి  ప్రయోజనాలుంటాయి. బంతి పూల మధ్యలో ఉండే తెల్లని బొడ్డులను తొలగించి ఎండబెట్టి పొడి పొడి చేయాలి. అనంతరం దానిని పెరుగు, చక్కెరలతో కలిపి తినాలి. అలా చేసినట్లయితే ఆయాసం తగ్గుతుంది. ఇకపోతే నోట్లో నుంచి రక్తం బయటకుపడటం, అర్షమొలలు, ఎర్ర బట్టి వంటి సమస్యలున్నవారు బంతి పూల రసం లేదా బంతిపూల ముద్దను నెయ్యిలో వేయించుకుని తీసుకున్నట్లయితే సమస్యలన్నీ పరిష్కరించబడుతాయి.

బంతిపూలు, ఆకులను రసంగా చేసుకుని రెండు సార్లు ప్రతీ రోజు తీసుకుంటే కిడ్నీలోని రాళ్లు కూడా కరిగిపోతాయి. ఈ రసానికి యాహూద్ భస్మం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంగ్లిష్ మందుల కంటే కూడా సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించే బంతి పూలు, ఆకుల రసం, ఆయుర్వేద షాపుల్లో లభించే యాహూద్ భస్మం తీసుకుంటే కనుక చాలా చక్కటి ఉపయోగాలుంటాయి.

Advertisement

బంతి పూలు, రెక్కలతో తయారు చేయబడే రసం ద్వారా చర్మంపై ఏర్పడే కురుపులను కూడా తగ్గించొచ్చు. తలపైన వీటిని రాసుకుంటే హెడేక్ కూడా తగ్గిపోతుంది. మలద్వారం నుంచి రక్తం పడేవారు బంతిపూల రెక్కలను తీసుకుంటే చక్కటి ఉపయోగం ఉంటుంది. అయితే, యాజ్ ఇట్ ఈజ్ కాకుండా బంతి పూల రెక్కలకు తగినంత సాల్ట్, జీలకర్ర , కరివేపాలకు పొడిని యాడ్ చేసి తీసుకున్నట్లయితే వంటిలోని హీట్ డిక్రీజ్ అవుతుంది.

Read Also : Coriander Health Benefits : కొత్తిమీర తింటే ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా ?

Advertisement
Exit mobile version