Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Mango Leaves: మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరంగా మారిన మామిడి ఆకులు.. మామిడి ఆకులతో మధుమేహానికి చెక్ పెట్టండిలా?

Mango Leaves: ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లలో మార్పులు కారణంగా ఎంతో మంది వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.ఈ క్రమంలోనే ఎక్కువమంది బాధపడే వ్యాధులలో డయాబెటిస్ ఒకటి. ప్రతి 10 మందిలో దాదాపు ఏడు మంది మధుమేహంతో బాధపడుతున్నారనీ తెలుస్తోంది. ఇకపోతే ఈ విధంగా మధుమేహంతో బాధపడే వారు వారి ఆహార విషయంలో ఎన్నో నిబంధనలు పెట్టుకుంటారు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు మామిడి పండ్లను తినడానికి ఇష్టపడరు.

మామిడి పండ్లను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అధిక మొత్తంలో ఉంటాయని భావించి మధుమేహులు మామిడి పండును దూరం పెడతారు. అయితే మామిడి ఆకులు మాత్రం మధుమేహంతో బాధపడే వారికి వరం అని చెప్పాలి. మన శరీరంలో చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచడానికి మామిడి ఆకులు ఎంతగానో దోహద పడతాయి. ముఖ్యంగా మామిడి ఆకులలో ఉన్నటువంటి పెక్టిన్ విటమిన్ సి ఫైబర్ ఈ పదార్థాలు మధుమేహం అధిక కొలెస్ట్రాల్ నియంత్రణకు దోహదపడతాయి. అధిక బరువు సమస్యతో బాధపడేవారు మామిడి ఆకులను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల తమ శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.

మామిడి ఆకులను ఏ విధంగా తీసుకోవాలి అనే విషయానికి వస్తే ప్రతి రోజు సాయంత్రం 10 నుంచి 15 మామిడి ఆకులను బాగా నీటిలో మరిగించి ఆ రాత్రంతా మామిడి ఆకులను ఆ నీటిలో ఉంచి చల్లార బెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం పరగడుపున ప్రతిరోజు మామిడి ఆకుల నీటిని వడపోసి తాగటం వల్ల మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను పెరగడమే కాకుండా శరీరంలో చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచడానికి దోహదపడతాయి. అందుకే మామిడి ఆకులు డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఒక గొప్ప వరం అని చెప్పాలి. కేవలం డయాబెటిస్ మాత్రమే కాకుండా ఇతర జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ మామిడి ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి.

Advertisement
Exit mobile version