Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Mosambi : ఈ జ్యూస్ రోజు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉంటుంది.

Mosambi :  ఈ మధ్య కాలంలో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారు. ఈ కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి అనేక కసరత్తులు చేస్తుంటారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు బత్తాయి మంచి ఔషధంగా పని చేస్తుంది అంటున్నారు నిపుణులు. మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే పండ్లలో బత్తాయి చాలా ముఖ్యమైనది. బత్తాయి సిట్రస్ కుటుంబానికి చెందినది. దీనిలో సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. బత్తాయి జ్యూస్ నీ చాలామంది ఇష్టపడుతుంటారు. అయితే దీని వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం ఎవరికీ తెలియదు. బత్తాయి జ్యూస్ తరచుగా తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. దీనిలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. దీనిలో యాసిడ్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఒక బత్తాయి పండు లో 50 మిల్లీగ్రాముల వరకు సి విటమిన్ లభిస్తుంది. అంటే ఇది రోజువారీ మనకు కావలసిన విటమిన్ సి లో 22 పర్సంటేజ్ అన్నమాట.

Health Benefits of mosambi juice daily

Mosambi : బత్తాయి జ్యూస్ రోజు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. 

బత్తాయి లో విటమిన్ సి తోపాటు విటమిన్ ఏ, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు, పాస్పరస్, పొటాషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. బత్తాయిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటీ ట్యూమర్, యాంటీ డయాబెటిక్, యాంటీ అల్సర్ వంటివి అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

జీర్ణక్రియకు మంచిది : బత్తాయి లో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. అంతేకాకుండా మలబద్ధకాన్ని నివారించి పేగుల్లోని విషపదార్ధాలను తొలగిస్తాయి.

Advertisement

కొలెస్ట్రాల్ కరుగుతుంది : అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణాలు బత్తాయిలో ఉన్నాయి. ప్రతిరోజు బత్తాయి జ్యూస్ తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

చర్మానికి మంచిది : బత్తాయి లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. సి విటమిన్ అనేది కొల్లాజెన్ అనే ప్రోటీన్ తయారుచేయడానికి అవసరం. కొల్లాజెన్ చర్మాన్ని బిగుతుగా బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. బత్తాయి లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వలన చర్మాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుండి రక్షిస్తాయి. బత్తాయి తీసుకోవడం వల్ల ముఖం పై మచ్చలు, మొటిమలు కూడా తగ్గుతాయి.

క్యాన్సర్ కి చెక్ : బత్తాయి లో ఉండే కొన్ని పోషకాలు వలన క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ప్రధానంగా లివర్ క్యాన్సర్, బ్రెస్ట్ కాన్సర్ భారీ నుండి మనల్ని కాపాడతాయి. ఓ పరిశోధన సంస్థ బత్తాయిలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయని పేర్కొంది.

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?

Read Also : health tips : బాదం పొట్టుతో కలిపి తింటే కలిగే ప్రయోజనాలు..

Advertisement
Exit mobile version