Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Guava Health Benefits : నోరూరించే జామలో ఎన్ని ప్రయోజనాలో తెలుసా? ఏ రంగు జామ పండ్లు తింటే మంచిదో తెలుసా?

Guava Health Benefits : సీజనల్ పండ్లు తినడం వల్ల కల్గే లాభాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డాక్టర్లు అయితే కూరగాయలతో పాటు పండ్లను కూడా వీలయినంత ఎక్కువగా తినమని చెబుతుంటారు. జామ పండ్లు తినడం చాలా మంచిది. జలుబు అవుతుందని చాలా మంది ఈ పండును దూరం పెడతారు కానీ వాటిలో ఉన్నన్ని పోషకాల మరే పండ్లలో దొరకవు. అయితే జామ కాయల్లో చాలా రకాలు ఉంటాయి. కొన్నిట్లలో గుజ్జు ఎర్రగా, తెల్లగా ఉంటుంది. అయితే ఏది ఆరోగ్యానికి మంచిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

guava-health-benefits-and-importance-here

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉండడానికి, గుండె ఆరోగ్యం మెరుగయ్యేందుకు, బరువు తగ్గేందుకు, జీర్ణ వ్యవస్థ బాగా పని చేయడానికి జామ పండ్లు తోడ్పడతాయని వివరిస్తున్నారు. అంతేకాకుండా జామ పండ్లలోని పదార్థాలు కేన్సర్ రాకుండా చూస్తాయని రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయని చెబుతున్నారు. చర్మానికి కూడా చాలా మేలు చేస్తాయి. గులాబీ గుజ్జు రంగు ఉన్న జామ పండ్లలో పై లాభాలన్నింటిని ఎక్కువాగ చేరుస్తాయి.

Guava Health Benefits : సీజనల్ ఫ్రూట్స్.. జామపండ్లను తప్పక తినాల్సిందే..! 

guava-health-benefits-and-importance-here

తెలుపు రంగులో గట్టిగా గుజ్జు ఉన్న జామ పండ్లను తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. జామ పండ్లను కోసిన వెంటనే తినాలని కోసి.. ఎక్కువ సేపు వదిలేస్తే వాటిలోని విటామిన్ సీ శాతం తగ్గిపోతుందని చెబుతున్నారు. ఏ రంగు గుజ్జు అనా సరే జామ పండ్లతో అధ్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.

Advertisement

Read Also : Boda kakarakaya : బోడ కాకరకాయ అన్ని రోగాలకు చెక్ పెడ్తుంది.. క్యాన్సర్‌కు కూడా!

Exit mobile version