Health Tips: సరైన నిద్ర ఆరోగ్యానికి ఎంతో మంచిది కాదు. ప్రతిరోజు మన శరీరానికి సరిపడినంత నిద్ర నిద్ర పోవటం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటామనే విషయం మనకు తెలిసిందే. అయితే అతిగా నిద్ర పోవడం వల్ల ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా అధిక సమయం పాటు నిద్రపోయేవారు ఏ క్షణంలోనైనా గుండెపోటుతో మరణించవచ్చని తాజాగా నిపుణులు పలు అధ్యయనాల ద్వారా వెల్లడించారు.సాధారణంగా ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవడం అవసరం. అలా కాకుండా 8 గంటలకు మించి నిద్ర పోవటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
కనుక మనం పదికాలాలపాటు బ్రతకాలంటే తప్పనిసరిగా శరీర వ్యాయామాలతో పాటు సరైన సమయం పాటు నిద్రపోవటం ఎంతో సురక్షితం. అలా కాకుండా రోజుకు ఎక్కువ సమయం పాటు నిద్రకే పరిమితమయితే శాశ్వత నిద్ర తీసుకోవాల్సి వస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇలా రోజుకు 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవడంతో పాటు, తప్పనిసరిగా గంట సమయం పాటు వ్యాయామం చేసినపుడే ఎంతో ఆరోగ్యంగా ఉండగలము.