Health Tips: అధిక శరీర బరువుతో బాధపడేవారు శరీర బరువు తగ్గడం కోసం ఎన్నో రకాల డైట్ లనుఫాలో అవ్వడమే కాకుండా వివిధ రకాల శరీర వ్యాయామాలు కూడా చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే శరీర బరువు తగ్గడం కోసం మరికొందరు రాత్రిపూట భోజనం చేయడం పూర్తిగా మానేస్తారు. ఇలా భోజనం మానేయడం వల్ల శరీర బరువు తగ్గుతారని భావిస్తుంటారు.అయితే ఇదే నిజం అనుకుని రాత్రి పూట అన్నం తినడం మానేస్తే చాలా సమస్యలలో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు.
ఇలా మధ్యాహ్నం తరువాత మరుసటి రోజు ఉదయం అల్పాహారం తీసుకోవడం వల్ల మన శరీరంలో విడుదలయ్యే జీర్ణ రసాల వల్ల కడుపులో మంటగా ఉంటుంది. అదేవిధంగా తీవ్రమైన తలనొప్పి చిరాకు రావడం కూడా మొదలవుతాయి.అందుకే రాత్రి సమయంలో తేలికపాటి అల్పాహారం తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా మన దరి చేరవు.ఇలా ఎక్కువ సమయం పాటు ఆహారం తినకపోవడం వల్ల మన శరీరానికి కావలసిన పోషకాలను కోల్పోవలసి వస్తుంది తద్వారా రక్తహీనత, నీరసంగా మారిపోవడం, బలహీనంగా తయారవడం వంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు.
- Health Tips: మహిళలు వైట్ డిశ్చార్జ్ సమస్యతో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలతో మీ సమస్యకు చెక్ పెట్టండి!
- Health Tips: వేసవికాలంలో ప్రతిరోజు ఉల్లిపాయ తింటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!
- Parenting Tips: గర్భిణీ స్త్రీలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా… అయితే మీ డైట్ లో ఈ జ్యూస్ ఉండాల్సిందే?
