Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Coffee with cigarettes : కాఫీ, టీ తాగుతూ సిగరెట్లు కాల్చే అలవాటు ఉందా మీకు.. అయితే కష్టమే!

Coffee with cigarettes : ఉదయాన్నే వేడి వేడి టీ లేదా కాఫీతో రోజుని ప్రారంభించడం మనలో చాలా మందికి అలవాటు. నిద్ర లేవగానే చాలా మంది వాటిని తాగకుండా ఉండలేరు. దాదాపు ప్రతిరోజూ జీవితంలో ఇది ఒక భాగమైపోయింది. అయితే కాఫీ, టీలు మనల్ని వాటికి బానిసలుగా మార్చుకుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆఫీసు, ఇల్లు ఎక్కడున్నా, టైంకి చేతికి కప్పు లేకపోతే చిరాకు అనిపిస్తుంది. అయితే చాలా మందికి కాఫీ తాగుతూ సిగరెట్ కాల్చే అలవాటు ఉంటుంది. ఈ విధంగా కాఫీ తాగుతూ.. పొగ పీల్చితే ఎన్నో ఆనారోగ్య సమస్లు చుట్టుముడుతాయని మీకు తెలుసా. ఏయే సమస్యలు తలెత్తుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Coffee cigarettes is bad combination for the heart attack know what experts

కాఫీతో పాటు పొగ తాగే అలవాటు ఉన్నవారు తరచుగా డీహైడ్రేషన్ కు గురవుతారు. అలాగే కాఫీ ఎక్కువగా తాగే అలవాటు తరచుగా ఉన్నవారు తరచుగా నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. నిజానికి, కెఫిన్ మన నిద్ర వ్యవస్థకు అంతరాయం కల్గిస్తుంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. టీ లేదా కాఫీలోని కెఫిన్ జీర్ణ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది. కాఫీ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి పెద్దపేగు కార్యకలాపాలకు అంతరాయం కల్గిస్తాయి.

Read Also : Coffee effect: తరచుగా కాఫీ తాగితే తలనొప్పి ఖాయం.. కావాలంటే చూడండి!

Advertisement
Exit mobile version