Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Dusara theega : ఈ మొక్క ఆకుల రసం రోజూ తాగారంటే… ఆరోగ్యంగా ఉండొచ్చు!

Dusara theega : పొలాల గట్లపై, చేనుకు వేసిన కంచెలకు అల్లుకుని పెరిగే తీగ జాతికి చెందిన మొక్కల్లో తీగ మొక్క కూడా ఒకటి. గ్రామాల్లో ఈ మొక్క గురించి తెలియని వారుండరు. మానవాళికి ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ మొక్క తీగలు ఎంతో బలంగా ఉంటాయి. గ్రామాల్లో వీటి తీగలతో కంచెలను, గడ్డి కట్టలను కడుతుంటారు. అయితే ఈ దూసర తీగ వల్ల అనేక ఔషధ గుణాలను కల్గి ఉంటుంది. కళ్ల సమస్యలు తగ్గించడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. కళ్లు ఎర్రగా మారడం, కంటిలో సమస్యలు, కళ్ల నుండి నీరు కారడం వంటి సమస్యలను నయం చేసుకోవచ్చు.

Dusara theega

ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి రసాన్ని తీసి పడుకునే ముందు కళ్ల రెప్పలపై రాసుకొని పడుకోవాలి. ఉదయాన్నే చల్లి నీటితో కళ్లను కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. దూసర తీగ ఆకులను ఉపయోగించి చర్మంపై వచ్చే దురదలను, దద్దుర్లను, మొటిమలను తగ్గించుకోవచ్చు. అలాగే వేడితో బాధపడే వారు ఈ ఆకులను కచ్చాపచ్చాగా దంచి నీటిలో వేసి 2 గంటల పాటు నీటిలో వేసి 2 గంటల పాటు ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల నీరు కొద్దిగా జెల్ లా మారుతుంది. దీని నుండి ఒ స్పూన్ జెల్ తీసుకొని కండ చక్కెర కలుపుకొని తినడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది.

Read Also : Health Tips: తుమ్మి మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

Advertisement
Exit mobile version