Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Virata Parvam Tickets : విరాటపర్వం టికెట్ల రేట్స్ ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Virata Parvam Tickets : రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన విరాటపర్వం (Virata Parvam) శుక్రవారం (జూన్ 17న) థియేటర్లలోకి రానుంది. నక్సలైట్ల నేపథ్యంలో సాగే ఈ మూవీపై మొదటి నుంచి భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. విరాట పర్వం ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

1990లో యదార్థ సంఘటనల ఆధారంగా నక్సలిజం నేపథ్యంలో ఈ మూవీని డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు. ఎస్ఎల్వీ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ మూవీని నిర్మించారు. నక్సలైట్ రవి శంకర్ అలియాస్ రవన్నగా రానా నటించాడు. వెన్నెల అనే అమ్మాయి పాత్రలో సాయి పల్లవి నటించింది.

Virata Parvam Tickets : విరాట పర్వం మూవీ టికెట్ల రేట్లు.. ఏపీ, తెలగాణలో ఎంతంటే? 

మూవీ ప్రమోషన్లలో విరాటపర్వం టీమ్ బిజీగా ఉంది. హైదరాబాద్‌లో విరాట పర్వం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. జూన్ 17న విరాట పర్వం మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టికెట్స్ రేట్స్ ప్రకటించింది చిత్ర యూనిట్.

Advertisement
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!
Virata Parvam Movie Ticket Rates Fixed in Telugu States

ఈ ఇతిహాస ప్రేమకథను సరసమైన ధరల్లోనే చూడండి.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో విరాట పర్వం మూవీ టికెట్స్ రేట్స్ గురించి పోస్టు పెట్టింది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ రూ. 150 ఉంటే.. ఏపీలో థియేటర్లలో రూ. 147గా నిర్ణయించారు. తెలంగాణలో మల్టీప్లెక్స్ ధర రూ. 200 ఉంటే.. ఏపీలో జీఎస్టీతో రూ.177 ఉంటాయని మూవీ మేకర్లు వెల్లడించారు. ఈ మూవీలో నవీన్ చంద్ర, సాయిచంద్, ప్రియమణి, ఈశ్వరీరావు కీ రోల్స్ చేశారు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు.

Read Also : Virata Parvam Trailer : విరాట పర్వం ట్రైలర్ వచ్చేసింది.. వీడియో..!

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
Exit mobile version