Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Vijay devarakonda : లైగర్ జోడి క్రేజీ స్టెప్స్.. ఆనందంలో రౌడీ బాయ్ ఫ్యాన్స్!

Vijay devarakonda : ప్రస్తుతం కాలంలో చేతిలో స్మార్ట్ ఫోన్ ప్రతీ ఒక్కరూ రీల్స్ చేస్తూ తనలోని టాలెంట్ ని నెట్టింట్లో పెట్టేస్తున్నారు. సాదారణ ప్రజల నుండి సెలబ్రిటీల వరకూ అంతా ఇదే దారిలో నడుస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేతో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ డ్యాన్స్ వేశారు. జగ్ జగ్ జీయో అనే పంజాబీ పాటకు క్రేజీ స్టెప్పులేస్తూ… అందర్నీ ఆకట్టుకుంటున్నారు. వీరిద్దరి డ్యాన్స్ అదిరిపోవంతో కొద్ది సేపట్లోనే ఈ వీడియో వైరల్ గా మారింది.

Vijay devarakonda

అయితే లైగర్ సినిమా విడుదలకు ముందే ఇలా అనన్య పాండే – విజయ్ దేవరకొండ జోడీ డ్యాన్స్ చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. మీ జోడి అదరిందని కొందరు.. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే సినిమా ముందుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న లైగర్ సినిమాలో అనన్య, విజయ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Read Also : Vijay: కేవలం ఆ ఒక్క ఘటనతో పది సంవత్సరాలు మీడియాకు దూరమయ్యా… విజయ్ షాకింగ్ కామెంట్స్!

Exit mobile version