Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Upasana: తన కోరికను ఇలా బయట పెట్టిన ఉపాసన.. ఎదురు చూడాల్సిందే అంటున్న రామ్ చరణ్!

Upasana: ఉపాసన కొణిదెల పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. మెగా కోడలిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉపాసన సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. అలాగే తన భర్త రామ్ చరణ్ పై కూడా ఎంతో ప్రేమను వ్యక్త పరుస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఉపాసన పోస్ట్ కు రామ్ చరణ్ స్పందించడంతో ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం ఎండలు మండిపోవడంతో ఉపశమనం కోసం ఎక్కడికైనా చల్లని ప్రదేశానికి వెళ్లాలని ఉంది అంటూ ఉపాసన తన మనసులో ఉన్న కోరికను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా బయట పెడుతూ తన భర్త రామ్ చరణ్ కి ట్యాగ్ చేశారు. ఈ క్రమంలోనే ఈ పోస్ట్ పై స్పందించిన రామ్ చరణ్ తన కోరికను కూడా బయటపెట్టారు. నాకు కూడా ఎక్కడికైనా బయటకు వెళ్లాలని ఉంది. అయితే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అంటూ ఉపాసన పోస్ట్ కు రిప్లై ఇచ్చారు.

ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC15 సినిమా షూటింగ్ తో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా వైజాగ్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే వరుసగా షూటింగ్ ఉన్న కారణంగా తాను ఎక్కడికి వెళ్ళలేక పోతున్నానని,బయటకు వెళ్లాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాలని రామ్ చరణ్ వెల్లడించారు.ఇలా వీరిద్దరూ మనసులో ఉన్న కోరికను బయట పెడుతూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement
Exit mobile version