Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Chiranjeevi: ఇండస్ట్రీలో సక్సెస్ కావడానికి కారణం సురేఖ… చిరంజీవి కామెంట్స్ వైరల్!

Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి గత దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకెళ్తూ తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి కొన్ని రోజుల విరామం తర్వాత ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి నేడు మహిళా దినోత్సవం కావడంతో తన భార్య సురేఖ పై ప్రశంసలు కురిపించారు.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలో ఉన్న బ్లడ్ బ్యాంక్ సెంటర్ లో చిరంజీవి మహిళా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలోని సినీ పరిశ్రమకు చెందిన కొందరు మహిళలకు మెగాస్టార్ దంపతులు సన్మానం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ మహిళలు కుటుంబ బాధ్యతలను పోషించడంలో కీలకపాత్ర వహిస్తారని వారికి ఎన్నో బరువు బాధ్యతలు ఉంటాయని తెలియజేశారు.

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

తన తల్లి కూడా ఎన్నో బాధ్యతలు వహించారని తెలిపిన చిరంజీవి ఇండస్ట్రీలో తాను సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగడానికి కారణం సురేఖ అని మరోసారి తెలియజేసారు. తాను కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తించడం వల్ల 100% సినిమాలపై నేను దృష్టిసారించడంతోనే ఈ విజయం లభించిందని ఈ సందర్భంగా చిరంజీవి వెల్లడించారు.ఇకపోతే ప్రస్తుతం మహిళలు కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా అన్ని రంగాలలో ముందుకు వెళుతున్నారని చంద్రమండలం నుంచి ఒలంపిక్ స్థాయి వరకు మహిళలు రాణిస్తున్నారని, మునుముందు ప్రపంచం గర్వించేలా స్త్రీ శక్తి ఉండాలని ఈ సందర్భంగా చిరంజీవి ఆకాంక్షించారు.

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
Exit mobile version