Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Auto Ramprasad : సుధీర్, గెటప్ శీను లేకపోవడంతో ఒంటరైనా ఆటో రాంప్రసాద్.. ఎవరితో స్కిట్ చేయాలంటూ కంటతడి!

Auto Ramprasad : బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమం అంటేనే తప్పనిసరిగా సుడిగాలి సుధీర్ టీమ్ మనకు గుర్తుకు వస్తుంది.ఈ కార్యక్రమం గత తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రసారం అవుతున్నప్పటికీ దాదాపు 8 సంవత్సరాల నుంచి గెటప్ శీను ఆటో రాంప్రసాద్ సుడిగాలి సుధీర్ కలిసి అద్భుతమైన స్కిట్ ద్వారా ప్రేక్షకులను సందడి చేసేవారు. ఇలా ఈ ముగ్గురు కలిసి ఎంతో మంచి స్నేహితులుగా కూడా మారిపోయారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో జబర్దస్త్ కార్యక్రమం నుంచి ఒక్కొక్కరుగా తప్పకుంటూ వస్తున్నారు.

Auto Ramprasad

ఈ క్రమంలోని జడ్జిగా వ్యవహరిస్తున్నటువంటి నాగబాబు రోజా ఈ కార్యక్రమానికి గుడ్ బై చెప్పగా, కంటెస్టెంట్ గా ఉన్నటువంటి హైపర్ ఆది కూడా ఈ కార్యక్రమానికి దూరమయ్యారు. ఇలా వీరందరూ లేకపోవడంతో ఈ కార్యక్రమానికి కళ తప్పి పోయింది. ఇకపోతే సుడిగాలి సుదీర్ అయిన తన టీమ్ తో ఈ కార్యక్రమాన్ని నిలబెడతారు అనుకుంటే సుడిగాలి సుధీర్ గెటప్ శీను కూడా జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో వీరి టీమ్ లో ఉన్నటువంటి ఆటో రాంప్రసాద్ మాత్రమే ఒంటరివాడు అయ్యాడు.

ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రమోలో భాగంగా వీరి ఫ్రెండ్షిప్ గురించి రాకేష్ కార్తీక్ టీమ్ ఒక స్కిట్ చేశారు. ఈ స్కిట్ చూసిన ఆటో రామ్ ప్రసాద్ ఒక్కసారిగా తన స్నేహితులను తలచుకుని ఎమోషనల్ అయ్యారు. తన స్నేహితుడు ఇద్దరూ తనని వదిలి వెళ్లడంతో ఒంటరివాన్ని అయ్యాను.నేను ఎవరితో స్కిట్ చేయాలి అంటూ కంటతడి పెట్టుకోగా జడ్జీ స్థానంలో ఉన్నటువంటి ఇంద్రజ వెళ్లి తనని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది.మీ టీమ్ కి దిష్టి తగిలింది అంటూ ఆటో రాంప్రసాద్ ను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక ఆటో రాంప్రసాద్ ఎమోషనల్ కాగా రష్మీ ఏకధాటిగా కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.

Read Also :  Sudigali sudheer : సుడిగాలి సుధీర్ ఇంట సంబురాలు.. తండ్రైన తమ్ముడికి కంగ్రాట్స్!

Advertisement
Exit mobile version