Rashmika Mandanna: తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందడమే కాకుండా బాలీవుడ్ అవకాశాలను కూడా అందుకొని దూసుకుపోతున్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సినిమాలు మాత్రమే కాకుండా ఐటం సాంగ్ చేయడానికి కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రష్మిక ఒక్కో సినిమాకు సుమారు మూడు కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ ఐటమ్ సాంగ్ లో చేయడం కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.ఇక తనకు రెండు కోట్ల రూపాయలు చెల్లిస్తేనే ఐటమ్ సాంగ్ లో నటిస్తానని కరాఖండిగా చెప్పినట్లు సమాచారం. ఇక ఈ ముద్దుగుమ్మ కనుక ఈ ఐటెం సాంగ్ లో నటించి మంచి హిట్ కొడితే తన స్పీడ్ కు బ్రేకులు వేసే వారు ఉండరని చెప్పాలి.