Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

RRR Promotions : ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌‌తో బోర్ కొట్టిస్తున్న జక్కన్న..!

RRR Promotions : RRR Tarak and Ram Charan boring audience with RRR Promotions before RRR movie release

RRR Promotions : RRR Tarak and Ram Charan boring audience with RRR Promotions before RRR movie release

RRR Promotions : కొన్ని పెద్ద సినిమాలకు ప్రమోషన్ కార్యక్రమాలు సరిగా చేయక పోవడం వల్ల వసూళ్లు తక్కువ వచ్చాయి అంటూ గతంలో పలు సందర్భాల్లో మనం చర్చించుకున్నాం. కానీ ఇప్పుడు జక్కన్న సినిమా ఆర్‌ఆర్ఆర్ ప్రమోషన్ విషయంలో వింత ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో గత రెండు వారాలుగా ఆర్‌ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు సంబంధించిన విజువల్స్ ఫొటోస్ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతూ ఉన్నాయి.

ఈ నేపథ్యంలో అభిమానులు బోర్ ఫీల్ అవుతున్నాం అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ముఖ్య నగరాల్లో ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న చిత్ర యూనిట్ సభ్యులు ప్రతి చోట కూడా ఒకే ఈ వాదన వినిపిస్తూ వస్తున్నారు. ఇద్దరు హీరోలు దర్శకుడు రాజమౌళి పై ప్రశంసలు కురిపిస్తూ ఉంటే.. మరో వైపు దర్శకుడు రాజమౌళి ఇద్దరు హీరోలను ఆకాశానికి ఎత్తేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

RRR Promotions : RRR Tarak and Ram Charan boring audience with RRR Promotions before RRR movie release

ఎక్కడ చూసినా ఇదే వ్యవహారం అందుకే ప్రేక్షకులు ప్రమోషన్ కార్యక్రమాలపై పెదవి విరుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ సినిమా పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. కనుక ఇంకా ప్రమోషన్ కార్యక్రమాలు అవసరం లేదని వారు భావిస్తున్నారు. ఉత్తరాదిన సినిమాలు ఇంకా జనాల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అక్కడ భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ సభ్యులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరు హీరోలకు అక్కడ సరైన గుర్తింపు లేదు కనుక అక్కడ భారీ ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ప్రేక్షకులకు బోర్ కొట్టిన వారు విమర్శలు చేసిన జక్కన్న అనుకున్నది చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

Advertisement

Read Also : RRR vs Radhe Shyam : రాధేశ్యామ్‌‌తో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను పోల్చుతున్న వారికి ఇదే సమాధానం..!

Exit mobile version