Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Rana Daggubati : టాలీవుడ్ భల్లాల దేవుడికి కోపమొచ్చింది… ఏం టైంపాస్ గాళ్లు అంటూ ఫైర్

Rana Daggubati Strong Reply on Virataparvam Movie trollers

Rana Daggubati Strong Reply on Virataparvam Movie trollers

Rana Daggubati : టాలీవుడ్ భల్లాలదేవుడు దగ్గుబాటి రానాకు కోపమొచ్చినట్లుంది. అతడు సాయిపల్లవితో కలిసి నటిస్తున్న విరాట పర్వం సినిమా విడుదల గురించి ఓ సంస్థ వాళ్లు చేసిన ట్వీట్ కు రానా ఘాటు రిప్లై ఇచ్చారు. ఏం టైంపాస్ గాళ్లు బ్రో మీరు అంటూనే ఫైర్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే…

రానా, సాయిపల్లవి జంటగా వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న డిఫరెంట్ మూవీ విరాట పర్వం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ విషయం గురించే ఓ సంస్థ వారు ట్వీట్ చేస్తూ రానా విరాట పర్వం సినిమా థియేటర్ లో కాకుండా డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ అవుతుందని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు రానా స్పందిస్తూ సదరు సంస్థను ఉతికారేశారు.

మీరు ఏం టైం పాస్ గాళ్లు అంటూ రియాక్ట్ అయ్యారు. ఈ సినిమాలో సాయిపల్లవి కూడా నటిస్తుండడంతో ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలో కూడా థియేటరికల్ రిలీజ్ చేస్తే మంచి బిజినెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Advertisement

అంటే రానా చెప్పిన దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే విరాట పర్వం సినిమా డైరెక్టుగా ఓటీటీలోకి కాకుండా పెద్ద తెర మీదకే వస్తున్నట్లు తెలుస్తోంది. రానా ట్వీట్ కు అభిమానులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది అసలు రిలీజ్ ఎప్పుడో క్లారిటీ ఇస్తే బాగుంటుందని ట్వీట్ చేస్తుండగా.. ఇంకా కొంత మంది మాత్రం తొందరగా ఏదో ఒక ప్లాట్ ఫాంలో విరాట పర్వం సినిమాను విడుదల చేయండని అంటున్నారు. మరి రానా విరాట పర్వం రిలీజ్ కు ఎప్పుడు ముహూర్తం కుదురుతుందో చూడాలి?
Read Also : RRR కనుక తేడాకొట్టిందో? రాజమౌళి పరిస్థితి ఇక అంతే..!

Exit mobile version