Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Ramarao On Duty : మాస్ రాజాను కూడా వదల్లేదుగా.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ వీడియో లీక్..!

Ramarao On Duty : మాస్ మహారాజ్ రవితేజ (Ravi teja) నటించిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ జూలై 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ రిలీజ్‌కు ఒకరోజు ముందే అందులో మెయిన్ లీడ్ వీడియో లీక్ అయింది. మూవీ షూటింగ్ నుంచి ఏదో ఒకటి లీక్ చేస్తూనే ఉంటారు లీక్ రాయుళ్లు. తాజాగా రామారావు ఆన్ డ్యూటీ మూవీకి సంబంధించిన 20 సెకన్ల వీడియోను కూడా లీక్ రాయుళ్లు లీక్ చేశారు. ఇప్పుడు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామారావు ఆన్ డ్యూటీ మూవీకి కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

RamaRao On Duty _ Leaked video clip from Ravi Teja starrer on Social Media

ఇప్పటికే వరుస ప్లాపులతో సతమవుతున్న మాస్ మహారాజ్‌కు ఈ మూవీపై గట్టిగానే ఫోకస్ పెట్టాడు. ఈ నేపథ్యంలో జూలై 29న మూవీ రిలీజ్ కాబోతోంది. ఇంతలోనే మూవీ వీడియో లీక్ కావడం మాస్ మహారాజ్ చిత్ర యూనిట్‌లో ఆందోళన నెలకొంది. రవితేజ విలన్లకు గట్టి వార్నింగ్ ఇస్తోన్న వీడియో అది.. దాదాపు 20 సెకన్ల పాటు ఉన్న వీడియోలో.. అధికారం ఉంది కదా అని కొండలు తోడేస్తా.. అడ్డంగా భూములు దోచేద్దా అనుకుంటే.. అని రవితేజ వార్నింగ్ డైలాగ్ చెప్పాడు. చూస్తుంటే.. ఈ మూవీలో కొంచెం పొలిటికల్ టచ్ కూడా ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. రవితేజ ఈ మూవీలో సరికొత్త రోల్‌లో కనిపించనున్నాడు.


ఈ వీడియో లీక్ వ్యవహారంపై చిత్ర నిర్మాతలు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. ఎడిటింగ్ రూమ్ నుంచి రామారావు మూవీ సీన్స్ లీకైనట్లు చిత్ర బృందం భావిస్తోంది. లీకైన వీడియోలో అధికార పార్టీపై రవితేజ విరుచుకు పడుతున్నట్టుగా డైలాగ్స్ ఉన్నాయి.

Advertisement

శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి ఈ మూవీని నిర్మించారు. రవితేజకు జోడీగా దివ్యాంశ కౌశిక్‌ నటించారు. రజీష విజయన్‌, వేణు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ మహారాజాను ముందెన్నడూ చూడని రీతిలో శరత్‌ మండవ చూపించారు. ప్రభుత్వ అధికారిగా రవితేజ కనిపించనున్నారు. ఈ మూవీ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Also : Rashmika mandanna : ఫ్యాషన్ వీక్ లోరెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న రష్మీక మందన్న…

Advertisement
Exit mobile version