Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Pushpa Official Trailer : ‘పుష్ప’ ట్రైలర్‌ వచ్చిందిగా.. తగ్గేదే లే… కేక పుట్టిస్తోంది!

Pushpa Official Trailer : Allu Arjun Movie Pushpa Trailer Released Today

Pushpa Official Trailer : Allu Arjun Movie Pushpa Trailer Released Today

Pushpa Official Trailer : తెలుగు ఐకాన్ స్టార్ అల్లూ అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్.. అల్లు అర్జున్ నటించిన అప్ కమింగ్ మూవీ పుష్ప అఫిషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది. కొద్దిసేపటికే ట్రైలర్ కు ఫుల్ రెస్సాన్స్ వచ్చింది. నెట్టింట్లో పుష్ప ట్రైలర్ కేక పుట్టిస్తోంది. 2 నిమిషాల 31 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ తో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అడవిలో జరిగే సంఘటనలకు సంబంధించి తెరకెక్కించిన తీరు, అందులోని పాత్రలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందానే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బన్నీ అభిమానులు.. ఈ ట్రైలర్ లో నేపథ్య సంగీతం మరింత ఆకర్షణగా నిలిచింది. అల్లు అర్జున్ అభిమానులకు పుష్పతో ఫుల్ మిల్స్ దొరికినట్టే..

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

పుష్ప మూవీలో అల్లు అర్జున్ ఒకే ఒక్క డైలాగ్.. తగ్గేదే లే.. ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ‘శ్రీవల్లి’, ‘సామి’, ‘ఏయ్‌ బిడ్డా’, ‘దాక్కో దాక్కో మేక’ అనే నాలుగు పాటలు విడుదల అయ్యాయి. ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత అల్లు అర్జున్‌- సుకుమార్‌ కాంబినేషన్‌‌లో పాన్‌ ఇండియా స్థాయిలో పుష్పను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఈ మూవీలో ఐకాన్ స్టార్ సరసన రష్మిక నటిస్తోంది. ఫహద్‌ ఫాజిల్‌ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక సునీల్‌, అనసూయ కీ రోల్స్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందించాడు. ఈ మూవీని ముత్తంశెట్టి మీడియాతో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ రెండు పార్టులుగా నిర్మిస్తోంది. ‘ది రైజ్‌’ పేరుతో ఫస్ట్ పార్ట్ డిసెంబరు 17న రిలీజ్ కానుంది.

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

Read Also : Singer Chinmayi : సింగర్ చిన్మయిని గలీస్‌గా బూతులు తిట్టిన ఎన్నారైలు.. ఎందుకంటే?

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
Exit mobile version