Prabhas: రాధే శ్యామ్ సినిమాతో దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ల పైన దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో భారీ వసూళ్లను రాబట్టలేకపోయింది. దీంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు లోనైనట్టు సమాచారం. సినిమా రిలీజ్ అయిన ప్రారంభం నుంచే ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. భారీ స్థాయిలో ప్రమోషన్స్ ను చేసినా ఈ సినిమాకు ప్లస్ కాలేకపోయింది. బాహుబలి తర్వాత మళ్లీ భారీ బడ్జెట్ తో రాధే శ్యామ్ సినిమా వస్తుందని తెలిసి ప్రేక్షకులు ఎంతో సంబరపడ్డారు. కానీ అందులో సగం వంతైనా విజయానికి చేరువ కాలేకపోయిందని టాక్.
సలార్ చిత్రం షూటింగ్ చాలా రోజుల కిందటే మొదలైంది. దీనికి సంబంధించిన మొదటి షెడ్యూల్ కూడా ఎప్పుడు పూర్తయింది. హీరో ఇంట్రడక్షన్ పార్ట్ ను సింగరేణి గనుల్లో ఇప్పటికే షూట్ చేశారు. అంతేకాకుండా ఈ మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయం కూడా చేస్తున్నాడని ఎప్పటినుంచో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల నటి శృతిహాసన్ నటించనున్న సంగతి తెలిసిందే. ఇక మరో ముఖ్య విషయం ఈ మూవీలో ప్రతి కథానాయకుడిగా జగపతి బాబు నటించనున్నాడని సమాచారం.