Sarkaru Vaari Paata: చాలా కాలం తర్వాత సర్కారు వారి పాట సినిమాతో మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈనెల 12వ తేదీన విడుదలైన ఈ సినిమా గురించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగినందువల్ల ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటున్నారు. ఏ విషయాన్ని అయినా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారి గురించి అత్యంత వేగంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏదైనా సినిమా రిలీజ్ అయితే చాలు ఆ సినిమా హిట్ అయినా, ప్లాప్ అయిన ఆ సినిమా గురించి కామెంట్స్, ట్రోల్స్ చేస్తున్నారు.
చాల కాలం తర్వాత సర్కారు వారి పాట సినిమా ద్వార మహేశ్ బాబు థియేటర్లలో సందడి చేస్తున్నాడు. ఈ సినిమ గురించి మిక్స్డ్ టాక్ వస్తోంది. కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా గురించి నెగిటివ్ కామెంట్స్ చేస్తూ.. సినిమా డిజాస్టర్ అని ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్ చూసిన మహేశ్ బాబు అభిమానులూ మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో గురించి మహేశ్ బాబు అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.