Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Naga Chaitanya : సమంతకు వచ్చిన వ్యాధిపై నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్.. ఫస్ట్ టైం చైతూ చేసిన పని ఇదే..!

Naga Chaitanya : స్టార్ హీరోయిన్ సమంత అరుదైన వ్యాధితో బాధపడుతోంది. సమంత ఈ వ్యాధికి చికిత్స కోసం అమెరికా కూడా వెళ్లింది. సమంతకు ఈ వ్యాధి కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి సోకిందని అంటున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సామ్.. అమెరికాలో అందం కోసం ట్రీట్మెంట్ తీసుకుందంటూ అనేక వార్తలు వచ్చాయి.

Naga Chaitanya Shocking Comments on Samantha Disease For the First Time Respond

అంతేకాదు.. సమంత గర్భసంచి కూడా తీసేసుకుందని పుకార్లు వినిపించాయి. సమంత స్కిన్ ఎలర్జీ సమస్యతో బాధపడుతుందని, ఆ సమస్యకు చికిత్స తీసుకునేందుకు అమెరికా వెళ్లిందనే వార్తలు వచ్చాయి. ఈ విషయంలో సమంత పర్సనల్ మేనేజర్ కూడా కొన్ని విషయాలను రివీల్ చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో సమంత తనపై వస్తున్న రుమర్లకు చెక్ పెట్టేందుకు ఒక పోస్టు పెట్టింది. ఆ పోస్టులో తాను మయోసైటిస్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నానని వెల్లడించింది.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

సమంత పోస్టు చూసిన ఆమె కుటుంబ సభ్యుల నుంచి సినిమా సెలబ్రిటీలంతా త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. సమంత మాజీ భర్త నాగచైతన్య కూడా సమంత అనారోగ్యంపై స్పందించలేదు.

Advertisement

Naga Chaitanya : సమంతతో నాగ చైతన్య చెప్పిన మాట ఇదే.. 

సమంత, నాగచైతన్య ఏమాయ చేశావే మూవీ సమయంలో ఇద్దరూ ప్రేమించికున్నారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అనుకోని మనస్పర్ధలతో ఏడాది క్రితమే ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఎవరికి వారు తమ సొంత లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే సమంత ఒక అరుదైన వ్యాధితో బాధపడుతుంటే.. నాగ చైతన్య ఎందుకు స్పందించడం లేదని నెటిజన్లు అంటున్నారు. అయితే ఈ విషయంలో సమంతతో నాగ చైతన్య మాట్లాడినట్టు ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?
Naga Chaitanya Shocking Comments on Samantha Disease For the First Time Respond

సమంత ఆరోగ్యంపై చైతూ కూడా ఆరా తీశాడట.. సమంత తనకు వచ్చిన వ్యాధిని బయటపెట్టకముందే మొదటిసారిగా చైతూ ఆమెకోసం ఆస్పత్రికి వెళ్లి మరి పరామర్శించాడట.. సమంత ఆరోగ్యం ఎలా ఉందో చైతూ తెలుసుకున్నాడనే వార్త వైరల్ అవుతోంది. చైతూ మాటలతో సమంత కూడా అనుకూలంగానే రియాక్ట్ అయిందంటూ వార్తలు వస్తున్నాయి.

ఎంతైనా ఒకప్పుడు ఇద్దరూ భార్యభర్తలు కావడంతో విడిపోయినా వీరిద్దరిలో ఒకరిపై మరొకరిపై ప్రేమ ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఏదిఏమైనా చైతూ, సామ్ కలిసి మాట్లాడటంతో ఇప్పటివరకూ దూరంగా ఉన్న అక్కినేని, సామ్ అభిమానులు కూడా ఖుషీ ఖుషీ అవుతున్నారు. సమంత ఆరోగ్యం విషయంలో చైతూ ఇలాంటి శ్రద్ధ తీసుకోవడంపై అందరూ మెచ్చుకుంటున్నారు.

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?

Read Also : Shruti Haasan : గబ్బర్ సింగ్ హీరోయిన్ డాన్స్ ఇరగదీసిందిగా.. శ్రుతిహాసన్ ఏం చేసిందో చూడండి.. వైరల్ వీడియో..!

Advertisement
Exit mobile version