Kajal Agarwal:వెండితెర చందమామకు ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గతనెల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు మదర్స్ డే కావడంతో కాజల్ అగర్వాల్ కు నేడు ఎంతో స్పెషల్ అనే చెప్పాలి.తన కుమారుడు పుట్టిన తర్వాత వచ్చిన మొదటి మదర్స్ డే ను కాజల్ మొదటి సారిగా తన కుమారుడు నీల్ కిచ్లూను అభిమానులకు పరిచయం చేస్తూ ఒక సుదీర్ఘ పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా కాజల్ తెలియచేస్తూ.. నువ్వే నా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రానీవి నిన్ను పొందడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ ఈమె ఈ లేఖలో రాసుకొచ్చారు. అదేవిధంగా నేను రాసిన ఈ మొదటి లేక నాకు నువ్వు ఎంత ముఖ్యమైన వాడివో తెలియ జేయాలి అనుకుంటున్నాను. ఎప్పుడైతే నీ చిన్ని చేతులను నా చేతిలోకి తీసుకున్నానో అప్పుడే నీ ప్రేమలో పడిపోయాను. నీ అందమైన కళ్ళల్లోకి చూస్తూ నువ్వే నా ప్రపంచం అని భావించాను.రాబోయే సంవత్సరాలలో మీకు ఎంతో నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను అంటూ కాజల్ ఈ లేఖలో రాసుకొచ్చారు.
- Vishnu Priya : ఏ మాత్రం తగ్గని విష్ణు ప్రియ.. నలుపు చీరలో నాభి అందాలను చూపిస్తూ మతులు పోగొడుతుందిగా?
- Paruchuri Venkateswara Rao: గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్లిన పరుచూరి వెంకటేశ్వరరావు… షాక్ లో అభిమానులు!
- Jr NTR: ఎన్టీఆర్ కొత్తగా కొనుగోలు చేసిన ఇంటి ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… ఏకంగా అన్ని కోట్లా?

