Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

MAA Elections 2021 Results : ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపు

MAA Elections 2021 Results : నువ్వానేనా అన్నట్టుగా హోరాహోరీగా సాగిన మా అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించారు. ఆది నుంచి ఆధిక్యంలో దూసుకెళ్లిన విష్ణు ప్రకాశ్ రాజ్ పై అధ్యక్షుడిగా గెలుపొందారు. కొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ మధ్య గట్టి పోటీ సాగింది. రెండు ప్యాన్సల్స్ మధ్య హోరాహోరీ పోరు నడిచింది.

అభ్యర్థుల్లో విష్ణు ప్యానెల్ నుంచి బాబుమోహన్ ఓడిపోయారు. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ గెలిచాడు. మంచు విష్ణు ప్యానల్‌కు చెందిన గౌతమ్‌ రాజు జాయింట్‌ సెక్రటరీగా విజయం సాధించారు. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి శ్రీకాంత్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా గెలుపొందారు.

Manchu Vishnu Win Highest Majority

బాబూ మోహన్‌పై శ్రీకాంత్‌ గెలుపొందారు. మా జనరల్‌ సెక్రటరీగా మంచు విష్ణు ప్యానల్‌ నుంచి రఘుబాబు గెలుపొందారు. జీవితా రాజశేఖర్‌పై 7ఓట్ల తేడాతో రఘుబాబు విజయం సాధించారు. ట్రెజరర్‌గా మంచు విష్ణు ప్యానెల్‌ నుంచి శివ బాలాజీ 32 ఓట్ల తేడాతో గెలిచారు.

Advertisement

శివబాలాజీకి 316 ఓట్లు రాగా.. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌కు చెందిన నాగినీడుకు 284 ఓట్లు వచ్చాయి. మంచు విష్ణు ప్యానల్‌ నుంచి 10మంది ఈసీ సభ్యులు గెలిచారు. బొప్పన,శివ, జయవాణి, మాణిక్‌, హరినాథ్‌, శశాంక్‌, పూజిత, పసునూరి, శ్రీనివాస్‌, శ్రీలక్ష్మీ గెలుపొందారు. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌లో 8మంది గెలిచారు.

Exit mobile version