Jyothika – Surya: కోలీవుడ్ క్యూట్ కపుల్స్ లలో ఒకటైన సూర్య,జ్యోతిక గురించి మనందరికి తేలిసిందే. ఈ జంట కలిసి కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. అనంతరం వివాహం చేసుకుని రీల్ జంట కాస్త రియల్ జంట గా మారారు. ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. జ్యోతిక ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఫ్యామిలీ బాధ్యతలు నిర్వహిస్తూ, మరొకవైపు హోమ్ బ్యానర్ 2 డి ఎంటర్టైన్మెంట్స్ బాధ్యతలు కూడా చూసుకుంటోంది. ఇది ఇలా ఉంటే వీరిద్దరికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హీరో సూర్య మరోకసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నారట.
ఈ సినిమాకు చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా,టూడి వెంకట్ పతాకం పై సూర్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. సూర్యకు తొలి రోజుల్లో నంద, ఆ తర్వాత పితామగన్ చిత్రంతో మరో సంచలనం విజయాన్ని అందించిన బాల తాజాగా నిర్మించనున్న ఈ చిత్రంపై ఇప్పటి నుంచే సినీ వర్గాల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది.