Junior ntr : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అితే దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ సంచలనం సృష్టించింది. దాదాపు 1200 కోట్ల క్లబ్ లోకి చేరింది. అయితే ఈ సినిమా హిట్ ను ఆస్వాదిస్తున్న హీరో జూనియర్ ఎన్టీఆర్… ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సింగపూర్ వెళ్లారు. అక్కడి ఓ ప్రముఖ టీఎస్ఎంబీఎస్ మాల్ లో ఎన్టీఆర్ అక్కడి ప్యాన్స్ తో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే ఈ ఫొటోల్లో ఎక్కడా తారక్ భార్య కానీ, పిల్లలు కానీ కనిపించలేదు. చూస్తుంటే తన స్నేహితులతో కలిసి ఎన్టీఆర్ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న కొరటాల సినిమాలో తారక్ ఈ సారి కొత్త లుక్ లో మెరవబోతున్నట్లు టాలీవుడ్ సర్కిల్ టాక్. జనతా గ్యారేజీ లాంటి హిట్ సినిమా తర్వాత కొరటాల-తారక్ క్రేజీ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read Also : NTR 30: ఎన్టీఆర్ బర్తడే స్పెషల్.. ఎన్టీఆర్ 30 లో ఈ విషయాన్ని గమనించారా?
- RRR Movie Release : ఆర్ఆర్ఆర్ సినిమాలో హార్ట్ బీట్ రెట్టింపు చేసే సన్నివేశం అంటూ.. బాంబు పేల్చిన జక్కన్న..!
- Junior ntr : జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ నెంబర్ లీక్.. గ్యాప్ లేకుండా చేస్తూనే ఉన్నారట పాపం!
- Bimbisara Pre Release Event : బింబిసార ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ సందడి.. నందమూరి ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్..!
