Rashmika: టాలీవుడ్ బ్యూటీ, నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీ గా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే పుష్ప సినిమాతో భారీ హిట్ టాక్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా ఈ బ్యూటీకి యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. రష్మిక మందన్న సినిమాలో తన అందం అభినయంతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తు ఉంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా రష్మిక మందన మాట్లాడుతూ.. ఈ లక్ష్యాన్ని అయినా సాధించడానికి స్థిరత్వం ముఖ్యమని, అందుకు ఫిట్నెస్ కూడా వర్తిస్తుంది అని తెలిపింది. అదేవిధంగా వ్యాయామాలు, ఫిజియోలు, డైట్ లు ఆలోచనలు అన్నీ కూడా స్థిరంగా ఉండాలి అని తెలిపింది.. అదేవిధంగా బిజినెస్ కోసం చేసేపని మొదట్లో కష్టంగా అనిపిస్తుందని కానీ అలవాటు పడ్డాక చాలా సరదాగా ఉంటుంది అని చెప్పుకొచ్చింది. ఇక ఫిట్నెస్ గోల్స్ ను రీచ్ అయ్యేకొద్ది మనలో ఉత్సాహం పెరుగుతుందని తెలిపింది. కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా వర్క్ ఔట్స్ మాత్రమే మిస్ కాను అంటుంది రష్మిక మందన.