Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Sai Pallavi : వాళ్ళాలా నేను ఆ పాటలలో నటించలేను.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్!

Sai Pallavi : నేచురల్ బ్యూటీ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఫిదా సినిమా ద్వారా తన నటనతో డాన్సులతో అందరినీ మైమరిపించిన సాయి పల్లవి అనంతరం కథ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకొని వరుస విజయాలను అందుకుంటుంది.ఈ క్రమంలోనే సాయిపల్లవి తెలుగు తమిళ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఈమె రానా సరసన నటించిన విరాటపర్వం జూలై 1వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Sai Pallavi

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సాయిపల్లవి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.గతంలో సాయి పల్లవి ఐటమ్ సాంగ్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు తాను అలాంటి పాటలలో నటించనని చెప్పిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా మరోసారి ఐటమ్ సాంగ్స్ ప్రస్తావన రావడంతో ఈమె తన అభిప్రాయాన్ని తెలియజేశారు. సమంత పూజా హెగ్డే మాదిరి ఐటమ్ సాంగ్స్ లో నటించే అవకాశం వస్తే నటిస్తారా.. అని ప్రశ్నించగా అందుకు తను నో అనే సమాధానం చెప్పారు.

ఐటమ్ సాంగ్స్ లో నటించడం నాకు కంఫర్ట్ గా ఉండదు. ముఖ్యంగా ఆ పాటలో నటించాలంటే ఆ పాటకు అనుగుణంగా వేసుకునే బట్టలు నాకు కంఫర్ట్ గా ఉండవు. డ్రెస్సింగ్ సరిగా లేకపోతే నాకు కంఫర్ట్ గా ఉండదు. అందుకే వాళ్ల నేను ఐటమ్ సాంగ్స్ లో నటించను అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి పాటలలో నటించడానికి డబ్బులు ఎక్కువగా ఇస్తామని చెప్పినా నేను ఇలాంటి పాటలలో నటించడానికి ఒప్పుకోను అంటూ ఐటమ్ సాంగ్స్ గురించి సాయిపల్లవి క్లారిటీ ఇచ్చారు.ఇలా సాయి పల్లవి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే మంచి విజయాలను సొంతం చేసుకున్నారు.

Advertisement

Read Also : Sai Pallavi: మహేష్ బాబు కోసం ముసుగు వేసుకొని వెళ్ళిన నాని హీరోయిన్.. ఎందుకో తెలుసా?

Exit mobile version