G
Telugu News » Entertainment » hyper aadi insult navya swamy and comments ravi krishna by calling grandfather
⚡ Entertainment, Latest

Hyper Aadi: నవ్య స్వామి పరువు తీసిన హైపర్ ఆది.. రవి కృష్ణను తాతయ్య అంటూ కామెంట్స్!

Hyper Aadi: హైపర్ ఆది ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ఈ క్రమంలోనే

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Hyper Aadi: హైపర్ ఆది ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ఈ క్రమంలోనే ఢీ కార్యక్రమం ద్వారా హైపర్ ఆది చేస్తున్నటువంటి రచ్చ మామూలుగా లేదు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది రవికృష్ణ కాలేజ్ సీనియర్స్ లాగా నటించగా, నవ్య స్వామి పాపీ మాస్టర్ కొత్తగా కాలేజ్ కి చేరిన స్టూడెంట్ లాగా సందడి చేశారు.

ఈ క్రమంలోనే హైపర్ ఆది నవ్య స్వామిని దగ్గరికి పిలిచి కొత్తగా చేరావా ఏ క్లాస్ అని అడుగుతారు. నవ్య స్వామి డిగ్రీ ఫస్టియర్ అని సమాధానం చెప్పగా.. ఓ కాలేజా? అని హైపర్ ఆది అనగా వెంటనే నవ్య స్వామి కాదు స్కూల్ అంటూ తనపై పంచ్ వేస్తుంది.తన వెంట ఉన్న పాపి మాస్టర్ ని చూసి ఎందుకు మీ అత్తను నీకు తోడుగా తెచ్చుకున్నావా అంటూ కామెంట్ చేశాడు. వెంటనే పాపి మాస్టర్ ఇక్కడ మా తాతయ్య ఉంటే చూడటానికి వచ్చాను అంటూ హైపర్ ఆది పై సెటైర్ వేస్తుంది.

ఇక హైపర్ ఆది ఈ సెటైర్ ను రవి కృష్ణ పై తోశాడు. ఏరా నువ్వు వాళ్ల తాతయ్య వా? అంటూ రవి కృష్ణని ప్రశ్నించాడు. ఇకపోతే ఆది నవ్వ స్వామిని వాక్ చేయమని అడిగితే ఆమె ఎంతో సిగ్గుపడుతూ నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. అంతలోనే హైపర్ఆది ఏమైనా పోగొట్టుకున్నావు అంటూ మరోసారి తన పై పంచ్ వేసాడు. ఇలా ప్రతిసారి నవ్య స్వామి పై సెటైర్లు వేస్తూ ఆది అందరిని ఎంతగానో నవ్వించారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷Hyper AadiNavya swamyravi krishnatelugu film industryTollywood
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు