Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Ramesh Babu : హీరో మహేష్ సోదరుడు రమేష్ బాబు కన్నుమూత

Hero Mahesh Babu Brother Ramesh Babu Passed Away

Hero Mahesh Babu Brother Ramesh Babu Passed Away

Ramesh Babu : సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు (56) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న రమేశ్ బాబు ఈ రోజు సాయంత్రం తుది శ్వాస విడిచారు. కాలేయ వ్యాధి (లివర్) సమస్యలతో పోరాడుతూ చివరికి తనువు చాలించారు. శనివారం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అంతలోనే రమేశ్ బాబు చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు.

ఒకప్పుడు రమేష్ బాబు అనేక సినిమాల్లో హీరోగా నటించారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ కెరీర్‌ను మొదలుపెట్టారు. బాల నటుడిగా రమేష్ బాబు మనుషులు చేసిన దొంగలు, నీడ, పాలు నీళ్లు వంటి సినిమాల్లో నటించారు. సామ్రాట్ మూవీతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ముగ్గురు కొడుకులు, చిన్ని కృష్ణుడు, ఎన్ కౌంటర్ మూవీల్లో నటించారు. హీరోగా మాత్రం రమేష్ బాబు కొన్నాళ్లు మాత్రమే వెండితెరపై నటించారు.

ఆ తర్వాత రమేష్ బాబు, సూపర్ స్టార్ కృష్ణతో పలు చిత్రాల్లో నటించారు. చాలా సినిమాల్లోనూ మహేష్ బాబు, రమేష్ బాబు, కృష్ణ ముగ్గురు కలిసి నటించారు. హీరోగా రమేష్ బాబు సక్సెస్ సాధించలేకపోయారు. అయినప్పటికీ నిర్మాతగా మహేష్ బాబు మూవీలతో మంచి సక్సెస్ అందుకున్నారు. అర్జున్, అతిథి మూవీలను నిర్మించారు. దూకుడు సినిమాకు రమేశ్ బాబు సమర్పకుడిగా వ్యవహరించారు.

Advertisement

Read Also : మగాళ్లకు మంచి టిప్ ఇచ్చిన బాలకృష్ణ.. భార్య విషయంలో ఆయన అదే ఫాలో అవుతాడట.. 

Exit mobile version