Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Faria Abdullah : అక్కడ షేవ్ చేసుకోలేదా అంటూ కామెంట్ చేసిన నెటిజన్.. ఘాటు రిప్లై ఇచ్చిన జాతి రత్నాలు చిట్టి

Faria Abdullah : Jathi ratnalu Chitti Bold Reply to Netizen

Faria Abdullah : Jathi ratnalu Chitti Bold Reply to Netizen

Faria Abdullah : జాతి రత్నాలు సినిమాతో కుర్రకారు గుండెల్లో బాణాలు వేసింది చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా. హైదరాబాద్ కు చెందిన ఈ అమ్మడు ఈ సినిమా కంటే ముందు నుంచే నెట్టింట్లో తన యోగా వీడియోలతో తెగ హల్ చల్ చేస్తూ వస్తుంది. బయట ప్రపంచానికి చిట్టి ఎవరనేది పెద్దగా తెలియకపోయినా కూడా నెట్టింట్లో ఉండే వారికి మాత్రం చిట్టి గురించి జాతి రత్నాలు సినిమాకు ముందే తెలుసు.

చిట్టి తన యోగా వీడియోలను మత్తెక్కించే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎప్పుడు కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ మధ్య చిట్టి షేర్ చేసిన ఓ ఫొటోకు నెటిజన్ చాలా వల్గర్ గా కామెంట్ పెట్టాడు. దాంతో చిట్టి ఆ నెటిజన్ కు మైండ్ గిర్రుమనేలా రిప్లై ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. 

ఈ మధ్య సోషల్ మీడియా లో చిట్టి తన తోటి యోగా ఫ్రెండ్ అయిన హర్ష కోమెట్ ఫొటోను షేర్ చేసింది. దీంతో ఓ ఆకతాయి నెటిజన్ ఆ ఫొటోను చూసి కింద చాలా వల్గర్ గా కామెంట్ పెట్టాడు. చిట్టీ సంకలో షేవ్ చేసుకోలేదా అని ప్రశ్నించాడు. దీనికి చిట్టి ఏ మాత్రం బెదరకుండా చాలా బోల్డ్ రిప్లై ఇచ్చింది. చేసినా.. అయినా మళ్లీ వచ్చింది.. ఎన్ని సార్లు చేయాలా అంటూ చిట్టి ఇచ్చిన రిప్లైని చూసి చాలా మంది నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. ఈ రిప్లై చూసిన కామెంట్ చేసిన వ్యక్తి వెంటనే తన కామెంట్ ను డిలీట్ చేశాడు. అయినా కానీ అప్పటికే నెటిజన్లు ఆ కామెంట్ ను స్ర్కీన్ షాట్ తీసుకున్నారు.

Advertisement

Read Also : Jr NTR Fan Fire : నీవేం హీరోవి అంటూ ఎన్టీఆర్‌ను ప్రశ్నించిన అభిమాని.. 

Exit mobile version