G
Telugu News » Entertainment » f3 movie starring venkatesh and varun tej movie completed
⚡ Entertainment, Latest, Topstory

F3 Movie Release : షూటింగ్‌కి గుడ్‌బై చెప్పేసిన ఎఫ్3 మూవీ యూనిట్…

F3 Movie Release : టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్​, వరుణ్​ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం " ఎఫ్ 3 ".  

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

F3 Movie Release : టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్​, వరుణ్​ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ” F3 “. ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్​లో వచ్చిన ఎఫ్​2 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే మరోసారి కామెడీతో నవ్వించేందుకు సిద్ధమయ్యింది చిత్రబృందం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్​పై దిల్​రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్​ సంగీతం అందిస్తున్నారు. కాగా ఎఫ్2లో ఉన్నట్టుగానే విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తమ పాత్రలను పోషిస్తున్నారు.

ఇక సునీల్ మాత్రం కొత్తగా ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్ మళ్ళీ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు మరింత గ్లామర్ డోస్‌ను ఇచ్చేందుకు హీరోయిన్ సోనాల్ చౌహాన్‌ను కాస్టింగ్ లోకి తీసుకున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేశారు చిత్రయూనిట్. ఈ మేరకు అనిల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.

Advertisement

మా షూటింగ్ జర్నీ పూర్తి అయింది.
మీ నవ్వుల జర్నీ మొదలవుద్ది!😉

వస్తే, కొద్దిగా ముందుకి
వెళ్ళినా కొద్దిగా వెనక్కి😀

థియేటర్స్ కి రావడం మాత్రం పక్కా!😎#F3Movie @VenkyMama @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @Mee_Sunil @ThisIsDSP @SVC_official @f3_movie#F3OnApril28th pic.twitter.com/HsR7nYlsVP

Advertisement

— Anil Ravipudi (@AnilRavipudi) January 29, 2022

ఓ బస్సులో ఎఫ్3 టీమ్ అంత ఉన్న ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోకి… మా షూటింగ్ జర్నీ పూర్తి అయింది. మీ నవ్వుల జర్నీ మొదలవుద్ది, వస్తే కొద్దిగా ముందుకి… వెళ్ళినా కొద్దిగా వెనక్కి థియేటర్స్ కి రావడం మాత్రం పక్కా అంటూ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. కరోనా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతి తీసుకురాలేదు. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Read Also : Sai Pallavi Trolls : సాయిపల్లవి బాడీ షేమింగ్‌ ట్రోలర్లకు గట్టి క్లాస్ తీసుకున్న తెలంగాణ గవర్నర్..!

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷anil ravipudif3 movieF3 Movie Releasevarun tejvictory venkatesh
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు