Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Samantha pooja hegde: సమంతను దాటేసిన బుట్ట బొమ్మ.. ఎఫ్3కి భారీ రెమెన్యూరేషన్

Samantha pooja hegde : ఒకవైపు సినిమాలు చేస్తూనే ఐటెం సాంగ్స్ తో కుర్రకారును మత్తెక్కిస్తున్నారు హీరోయిన్లు. స్టార్ భామలు కూడా కెమెరా ముందు గ్లామర్ ఒలకబోస్తున్నారు. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్లే స్పెషల్ సాంగ్స్ చేస్తూ అలరిస్తున్నారు. అందుకు రెమెన్యూరేషన్ కూడా భారీగానే వసూలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న పుష్ప రి రైజ్ చిత్రంలో ఊ అంటావా.. అంటూ ఆడి పాడిన సమంత… ఆ ఐటెం సాంగ్ కోసం భారీగానే వసూలు చేసింది. ఊ అంటావా మావా.. సాంగ్ దేశవ్యాప్తంగా ఎంత ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిందే.

పుష్ప చిత్రంలో సమంత చేసిన ఆ స్పెషల్ సాంగ్ సూపర్ డూపర్ హిట్టు కావడం.. అది సినిమాకు ఎంతో మేలు చేయడంతో ఇప్పుడు చాలా మంది సినీ మేకర్స్ అదే బాటలో నడవడానికి సిద్ధమవుతున్నారు. రంగస్థలం సినిమాలో జిల్ జిల్ జిగేలు రాణి అంటూ తన అందచందాలతో కుర్రకారుకు చెమటలు పట్టించిన బుట్ట బొమ్మ.. మళ్లీ ఇప్పుడు అలాంటి ఓ ఫాస్ట్ బీట్ ఐటెం సాంగ్ చేస్తోందట.

Samantha pooja hegde

వరుణ్ తేజ్, వెంకటేష్ హీరోలుగా తెరకెక్కుతున్న ఎఫ్3 మూవీలో ఈ సాంగ్ హుషారెత్తించనుందట. ఈ స్పెషల్ సాంగ్ కోసం పూజా భారీగానే రెమెన్యూరేషన్ డిమాండ్ చేయడంతో కాదనలేక మేకర్స్ ఒప్పుకున్నారట. ఈ ఒక్క సాంగ్ కోసమే పూజా భామకు దాదాపు కోటి 75 లక్షలు ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

గతంలో పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసినందుకు గాను సమంతకు కోటి 25 లక్షలు ఇచ్చారని సమాచారం. అంటే ఇది అంతకంటే ఎక్కువే. ప్రస్తుతం హయ్యెస్ట్ పెయిడ్ స్పెషల్ గళ్ గా పూజా హెగ్డె మారి పోయిందంటూ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Read Also :Samantha : చైతూ.. నేనూ రెండో పెళ్లికి సిద్ధమే.. ఇలాంటి వ్యక్తి కావాలి.. సామ్.. తగ్గేదేలే..!

Advertisement
Exit mobile version