Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Bigg Boss Telugu 5 Elimination Today : బిగ్‌బాస్ షాకింగ్‌ ట్విస్ట్‌.. యాంకర్ రవి ఎలిమినేట్! హౌస్‌లో.. ఏం జరిగింది?

bigg-boss-telugu-5-elimination-today-anchor-ravi-eliminated-from-12th-week-nominations

bigg-boss-telugu-5-elimination-today-anchor-ravi-eliminated-from-12th-week-nominations

Bigg Boss Telugu 5 Elimination Today : అది బిగ్ బాస్ హౌస్.. అందులో ఏమైనా జరగొచ్చు. అంచనాలు తలకిందలు అవుతాయి. ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారో చెప్పడం కష్టమే. ఇప్పుడు అదే జరిగినట్టు తెలుస్తోంది. ఎవరూ ఊహించిన విధంగా టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడట. అది ఎవరో కాదు.. యాంకర్ రవి. బిగ్ బాస్ 12వారం నామినేషన్స్ లో రవి ఎలిమినేట్ అయినట్టు లీక్ అయింది. ఎప్పటిలానే ఈ వారం కూడా లీక్ బయటకు వచ్చింది. యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడంటూ టాక్ వినిపిస్తోంది.

ఇది తెలిసిన రవి ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. ఇదంతా అన్ ఫెయిర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవి కంటే సిరి, ప్రియాంక, కాజల్ కు ఎక్కువ ఓట్లు రావడం ఏంటి? అని కామెంట్ చేస్తున్నారు. టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్ యాంకర్ రవిని బిగ్ బాస్ బయటకు పంపించి వేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ 12వ వారం మానస్ మినహా మిగిలిన ఏడుగురు నామినేషన్లో ఉన్నారు. హ్యూజ్ ఫాలోయింగ్ ఉన్న షణ్నుకు టాప్ 5 లిస్టులో మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత సన్నీ ఉంటాడని అంచనా వేస్తున్నారు. రవిని ఎలిమినేట్ చేయడం బిగ్ బాస్ ఆడియన్స్‌కి బిగ్ షాకింగ్ అనే చెప్పాలి.

కాజల్ ను సేవ్ చేసిన సన్నీ.. అందుకేనా? :

ఇటీవల ఫైర్ ఇంజన్ టాస్క్‌లో కంటెస్టెంట్ సన్నీ ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’ గెలిచిన సంగతి తెలిసిందే. హౌస్‌లోకి వచ్చిన సన్నీ తల్లి కళావతితో ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇప్పించాడు బిగ్ బాస్. సన్నీ ఈ పాస్ తన కోసం వాడుకోవాలి. లేదా తన హౌస్ మేట్స్ కోసం వాడుకోవచ్చు. సన్నీ అదే పనిచేశాడు. కాజల్ ఎలిమినేషన్ మూమెంట్‌లో సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడేశాడట.. ఎలిమినేట్ కావాల్సిన కాజల్.. సేవ్ అయినట్టు తెలుస్తోంది. ఈసారి తక్కువ ఓట్లు వచ్చిన రవి ఎలిమినేట్ అయ్యాడని ప్రచారం జరుగుతోంది.

Advertisement
Anchor-Ravi-Elimination-Tod

అసలు ఎవిక్షన్ పాస్ సన్నీ గెలిచింది కాజల్ వల్లనే. మానస్ఎంత చెప్పినా సన్నీ వినలేదు. సన్నీని గెలిపించేందుకు ఫైర్ ఇంజన్ అలానే కూర్చుంది కాజల్. చివరికి సన్నీకే ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కింది. తనకు ఎవిక్షన్ పాస్ రావడానికి గల కారణం స్నేహితురాలు కాజల్ అంటూ సన్నీ ఆమెకు హెల్ప్ చేశాడని చెబుతున్నారు. ఈసారి హౌస్ నుంచి అమ్మాయిని పంపకుండా బిగ్ బాస్ టాప్ కంటెస్టెంట్‍ను బయటకు పంపినట్టు తెలుస్తోంది. అది యాంకర్ రవిని గట్టిగా టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే రవి ఎలిమినేట్‌ అయ్యాడా? లేదా అనేది నేటి ఎపిసోడ్‌లో తేలనుంది.

Read Also : Bigg Boss 5 Telugu : నేను ఆ టైంలో అక్కడుంటే ‘సిరి’ చెంప పగులగొట్టేవాడిని.. జెస్సీ సంచలన కామెంట్స్! 

Advertisement
Exit mobile version