Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Bigg Boss 5 Telugu : బిగ్‌బాస్‌లో తన సపోర్టు అతనికే అంటున్న హీరో విశ్వక్ సేన్.. 

Bigg Boss 5 Telugu : Vishwak sen Comments on VJ Sunny

Bigg Boss 5 Telugu : Vishwak sen Comments on VJ Sunny

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ 5 సీజన్ రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. షో ముగింపు దశకు చేరుకుంటున్న కొద్దీ చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే హౌజ్ నుంచి చాలా మంది కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఎనిమిది మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలిపోయారు. వీరిలో ఎవరు బిగ్ బాస్ 5 సీజన్ టైటిల్ గెల్చుకుంటారోనని ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కనీసం గెస్ చేసేందుకు కూడా ఎటువంటి వీలు లేకుండా షో నడుస్తోంది.

పాగల్, ఫలక్ నూమాదాస్ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మాస్ హీరో విశ్వక్ సేన్ తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ సన్నీ గురించి ఓ ఆసక్తికర విషయం పోస్ట్ చేశాడు. సన్నీని ఇంటి సభ్యులందరూ టార్గెట్ చేస్తూ వస్తున్నారు. మొదటి వారం కెప్టెన్సీ టాస్క్ లోనే తన తోటి కంటెస్టెంట్ అయిన సిరి సన్నీ తన టీ షర్ట్ లో సన్నీ చేతులు పెట్టాడని ఆరోపించింది. దీని గురించి షో హోస్ట్ నాగార్జున క్లారిటీ ఇచ్చాడు.

ఆ టాస్క్ కు సంబంధించిన వీడియో పుటేజీని చూపించి సన్నీది ఏమీ తప్పు లేదని నిర్ధారణ చేశాడు. తాజాగా సన్నీ ఎవిక్షన్ పాస్ గెల్చుకున్నాడు. కానీ ఆ సమయంలో ఎవరూ ఎటువంటి సంబరాలు చేయలేదని రవి, షణ్ముక్ మాట్లాడుతున్న వీడియోను విశ్వక్ సేన్ తన ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేసి మీరు సంబరాలు చేసుకోలేదేమో కానీ మేము ఇక్కడ చేసుకున్నాం అని తెలిపాడు.  దీంతో విశ్వక్ సేన్ సన్నీకి మద్దతు తెలుపుతూ రవి, షన్నూలకు స్ట్రాంగ్ పంచ్ వేశాడు.

Advertisement

Read Also : Faria Abdullah : అక్కడ షేవ్ చేసుకోలేదా అంటూ కామెంట్ చేసిన నెటిజన్.. ఘాటు రిప్లై ఇచ్చిన జాతి రత్నాలు చిట్టి

Exit mobile version