Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలలో కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమా ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు.ఇలా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన తండ్రితో ఉన్న అనుబంధం గురించి తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు.
తాను కొత్త ఇంటి నిర్మాణ పనులు చేపట్టడం వల్ల ఆ ఇంటి పనులు చూసుకుంటూ నాలుగు సంవత్సరాల నుంచి తన తండ్రికి దూరంగా ఉన్నానని రామ్ చరణ్ వెల్లడించారు. కేవలం సండే టైం మాత్రమే తన తండ్రితో కలిసి గడిపే వాడినని చరణ్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక నాలుగు సంవత్సరాల నుంచి తన తండ్రినీ ఎంతో మిస్ అవుతున్న సమయంలో ఆచార్య సినిమా తన తండ్రికి ఎంతో దగ్గర చేసిందని తెలిపారు. ఆచార్య సినిమా షూటింగ్లో భాగంగా తన తండ్రితో కలిసి నెల రోజుల పాటు ఒకే చోట ఉంటూ ఒక్క క్షణం తన తండ్రిని వదలకుండా నాన్నతో గడిపానని నా జీవితంలో ఈ నెల రోజులు ఎంతో మెమరబుల్ అంటూ చరణ్ తన తండ్రితో ఉన్న అనుబంధం గురించి తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు.
