Anushka: వెండితెర జేజమ్మ అనుష్క శెట్టి నిశ్శబ్దం సినిమా తర్వాత ఇప్పటివరకు ఏ సినిమాని ప్రకటించలేదు.ఇలా ఈమె తన సినిమాల గురించి ఏ విధమైనటువంటి ప్రకటన తెలియకపోవడంతో అనుష్క పూర్తిగా సినిమాలకు దూరం అవుతుందా అనే సందేహం ప్రతి ఒక్క అభిమానిలోను నెలకొంది. ఈ క్రమంలోని తాజాగా అనుష్క జాతిరత్నం హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి మహేష్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్ ఓ ఈ చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు.
కథ విషయంలో ఎంతో వైవిధ్యభరితంగా వుండే కథలను ఎంపిక చేసుకునే అనుష్క ఇప్పటివరకు ఇలాంటి ఎన్నో విభిన్నమైన చిత్రాలలో నటించారు. ఈ క్రమంలోనే తన తదుపరి చిత్రంలో తను ఒక చెఫ్ పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమాలో జాతిరత్నం సినిమాతో ఎంతో మంచి విజయాన్ని అందుకున్న నవీన్ పోలిశెట్టి అనుష్కతో జత కట్టనున్నారు. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి స్టాండ్-అప్ కమెడియన్‌గా మారాలని కోరుకునే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పనులను ప్రారంభించుకొని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
