Anchor Suma: యాంకర్ సుమ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ సుమక్కగా ఎంతో సుపరిచితమైన సుమ తన మాట తీరుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇలా బుల్లితెర పై ఎలాంటి స్పెషల్ ఈవెంట్ లు జరిగినా, అవార్డుల ఫంక్షన్ జరిగిన, సినిమా వేడుకలు జరిగిన తప్పకుండా సుమ అక్కడ ఉండాల్సిందే.ఈ విధంగా టీవీ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.
సుమ నటించిన జయమ్మ పంచాయతీ సినిమా హిట్ అయితే ఈమెకు సినిమా అవకాశాలు వస్తాయి.ఇలా సినిమా అవకాశాలు రావడంతో సుమ పూర్తిగా వెండితెర కే పరిమితమైతే తాను ఇతర కార్యక్రమాలకు దూరం అవుతుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే బుల్లితెర ప్రేక్షకులు ఇకపై సుమ బుల్లి తెరపై కనుమరుగవుతున్నారా అంటూ పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. సుమ తన గురించి వస్తున్నటువంటి ఇలాంటి వార్తలపై స్పందిస్తూ… తనకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టిన బుల్లితెర కార్యక్రమాలకు తానెప్పుడు దూరం కానని క్లారిటీ ఇచ్చారు. బుల్లితెరపై ప్రేక్షకులను సందడి చేసిన సుమా వెండి తెరపై ప్రేక్షకులను ఏ విధంగా సందడి చేయనుందో తెలియాల్సి ఉంది.