Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Vastu Tips : ఆర్థిక ఇబ్బందులా? మీ ఇంట్లో ఈ 4 మొక్కలు ఉంటే అంతా అదృష్టమే.. డబ్బులు వద్దన్నా వస్తూనే ఉంటాయి..!

Vastu Tips

Vastu Tips

Vastu Tips : ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? ఇంటికి అదృష్టంతో పాటు సంపద రెండింటికీ అదృష్టాన్ని అందించే మొక్కలు చాలా ఉన్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం అందుబాటులో ఉన్న లక్కీ ప్లాంట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. సంపదను కురిపిస్తాయి.

ఇంట్లో ఈ మొక్కలను నాటడం ద్వారా డబ్బుకు కొరత ఉండదు. సంపదను ఆకర్షించే ఈ మొక్కల వివరాలు ఇలా ఉన్నాయి. డబ్బును ఆకర్షిస్తాయని నమ్మతారు. అందులో ప్రధానంగా తులసీ (Tulsi Plant) మొక్క, మనీ ప్లాంట్, స్నేక్ ట్రీ, జాడే మొక్క పేర్లతో పిలుస్తారు. మీకు కూడా ఈ మొక్కలపై విశ్వాసం ఉంటే ఇంట్లో వాస్తు ప్రకారం పెట్టి చూడండి..

తులసి (Tulsi Plant)  :
భారత్‌లో తులసిని ఔషధ మొక్కగా పరిగణిస్తారు. భారతీయ సంస్కృతిలో స్వచ్ఛతకు చిహ్నంగా పిలుస్తారు. శతాబ్దాలుగా, తులసి ఔషధ గుణాలు, మతపరమైన ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. వాస్తు ప్రకారం.. తులసిని ఈశాన్యంలో ఉంచడం చాలా శుభప్రదం. ఎందుకంటే ఇది సానుకూలతను తీసుకొస్తుంది.

Advertisement

Read Also : AP EAPCET 2025 : విద్యార్థులకు బిగ్ అలర్ట్.. జూలై 7 నుంచే ఏపీ EAPCET కౌన్సెలింగ్ ప్రక్రియ.. కంప్లీట్ షెడ్యూల్.. కీలక విషయాలివే..!

Vastu Tips : మనీ ప్లాంట్ (Money Plant) :

మనీ ప్లాంట్ శ్రేయస్సు, సానుకూలతకు చాలా మంచిదని అంటారు. మనీ ప్లాంట్ అంటే సంపద, స్థిరత్వాన్ని ఆకర్షించే మొక్క. ఇది మాత్రమే కాదు, ఇంట్లో ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతుంది. మనసుకు శాంతిని ఇస్తుంది. మీ ఇంటి ఆగ్నేయ మూలలో ఉంచవచ్చు. చాలా మంచి దిశగా పరిగణిస్తారు.

స్నేక్ ట్రీ  (Sanke Tree) :
మీరు ప్రతికూల పరిస్థితులను అనుభవిస్తుంటే.. స్నేక్ ట్రీ మొక్క చాలా మంచిదని భావిస్తారు. ఈ మొక్క ఫెంగ్ షుయ్, వాస్తు రెండింటికీ మంచిదని భావిస్తారు. ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. మీ ఇంటి ప్రవేశ ద్వారం లేదా ఏదైనా మూలలో ఉంచుకోవచ్చు. దక్షిణ లేదా ఆగ్నేయంలో ఉంచడం ఉత్తమం.

Advertisement

జాడే మొక్క (Jade Plant) :

ఇంట్లో జాడే మొక్కను నాటడం కూడా చాలా శుభప్రదం. ఈ మొక్క ఆకులు గుండ్రని నాణేల మాదిరిగా కనిపిస్తాయి. అందుకే డబ్బును ఆకర్షించే మొక్కగా పరిగణిస్తారు. ఈ మొక్క వృద్ధి, అదృష్టం, శుభ సమయాలను తెస్తుందని నమ్ముతారు. ఈ మొక్క సంపద, అదృష్టంతో ముడిపడి ఉందని భావిస్తారు. దీనిని ఇంటి ప్రవేశద్వారం వద్ద ఉంచుతారు.

Exit mobile version