Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Shani dev : శనిదేవుడి ఆరాధనలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. అప్పుడే లాభాలు!

Shani dev : శనీశ్వరుడిని పూజించేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీస్కోవాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. శని దేవుడి పరమ భక్తుడైనా సరే ఈ తప్పులు చేస్తే ఆయన అస్సలే క్షమించలేరట. వెంటనే ఆగ్రహానికి గురవుతారట. అంతే కాకుండా శని దేవుడిని ప్రసన్నం చేస్కోవడంతో పాటు ఆయన శిక్షల నుంచి తప్పించుకునేందుకు ఎక్కువగా శని దేవుడినని పూజిస్తారు. పూజా సమయంలో ఒంటిపై ధరించే దుస్తుల రంగుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పూజకు ఎరుగు రంగు దుస్తులు వేస్కునే అలవాటు ఉంటే వెంటనే మార్చుకోవాలి. అలాగే నీలం లేదా నలుపు వేస్కుంటే శనీశ్వరుడు త్వరగా ప్రసన్నం అవుతాడు. అలాగే శని దేవుడికి ఎదురుగా ఎప్పుడూ నిల్చొని ఉండకూడదు. పూజ ముగిసిన తర్వాత నిలబడి ఉన్న స్థానం నుంచి అలాగే వెనక్కి వెళ్లిపోండి.

Shani dev

వెన్నుచూపిస్తే.. శనీశ్వరుడికి చాలా కోపం వస్తుందట. అలాగే స్వామి వారి కళ్లను అస్సలే చూడకండి. అలాగే పూజలో కూర్చునే సమయంలో మనం ఏ దిశలో కూర్చుంటున్నామో కూడా చూస్కోవాలి. సాధారణంగా తూర్పు ముఖంగా పూజలు చేస్తుంటారు. కానీ శని దేవుడికి పశ్చిమానికి అధిపతి కాబట్టి ఆ వైపుగా కూర్చోవడం మంచిది. రాగి పాత్రలకు బదులుగా పూజలో ఇనుప పాత్రలు వాడాలి. దాని వల్ల శనీశ్వరుడు త్వరగా ప్రసన్నం అయి మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.

Read Also :  Shani Dev Effect: ఏలినాటి శని దోషం అంటే ఏమిటి..ఈ దోషం తొలగిపోవాలంటే ఏం చేయాలి?

Advertisement
Exit mobile version