Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Viral Video : భర్త నిద్రపోయాక.. ప్రియుడితో ఏకాంతంగా.. చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు.. వీడియో!

Viral Video : భర్త కళ్లుగప్పి ప్రియుడితో ఏకాంతంగా గడిపేందుకు వెళ్లిన మహిళను అక్కడి గ్రామస్థులు చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు. ఆ మహిళతో పాటు ఆమె ప్రియుడిని కూడా చితకబాదారు. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. భర్తకు తెలియకుండా మరో యువకుడితో సాగిస్తున్న వివాహేతర సంబంధాన్ని అక్కడి గ్రామస్థులు రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. అంతటితో ఆగలేదు. వారిద్దరిని లాక్కొచ్చి ఓ చెట్టుకు కట్టేసి చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చివరికి ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video : Women Caught Extra marital affair

అసలేం జరిగిందంటే.. రాజస్థాన్‌ బన్స్వరాలోని ఘటోల్‌‌కు చెందిన వివాహిత మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలియకుండా చాటుమాటుగా వ్యవహారం నడిపింది. దొంగచాటుగా ప్రియుడిని కలవడం.. అతడితో తరచూ శారీరకంగా కలుస్తోంది. అదంతా గమనించిన గ్రామస్తులు ఆమెను వెంబడించారు. వెంటనే ఆ విషయాన్ని మహిళ కుటుంబ సభ్యులకు చెప్పారు. ఒకరోజున అర్ధరాత్రి సమంయలో ఆమె ప్రియుడిని కలిసేందుకు ఏకాంత ప్రదేశానికి వెళ్లింది. ఆమెకు తెలియకుండా వెంబడించిన గ్రామస్తులు వాళ్లిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఇద్దరిని జీపులో ఎక్కించుకొని తీసుకెళ్లారు.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

మహిళను, యువకుడిని చెరో చెట్టుకు తాళ్లతో కట్టేశారు. విచక్షారహితంగా కర్రలతో చితకబాదారు. వివాహిత బిగ్గరగా ఏడుస్తున్నా సరే.. ఆమెను దారుణంగా చితకబాదారు. యువకుడిని చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. ఇదంతా గ్రామస్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. మహిళను, యువకుడ్ని చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ఈ దారుణానికి పాల్పడిన గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇద్దరు వ్యక్తులను దారుణంగా చిత్రహింసలకు గురిచేయడం నేరంగా పరిగణిస్తూ కేసు నమోదు చేసినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

Advertisement

Read Also : Actress hariteja: పొట్టి పొట్టి బట్టలతో రోడ్లపై హరితేజ.. పిచ్చెక్కిపోతున్న కుర్రకారు!

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?
Advertisement
Exit mobile version