Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Shocking video : ఎంజాయ్ కోసం స్విమ్మింగ్ పూల్ లోకి దూకాడు.. కానీ సింక్ హోల్ లో పడి చనిపోయాడు!

Shocking video : బంధువుల ఆహ్వానంతో ఓ ఇంట్లోని వేడకకు వెళ్లాడు. అందరూ ఆనందంగా స్విమ్ చేద్దామని స్విమ్మింగ్ పూల్ లోకి దిగాడు. మాటలు చెప్పుకుంటూ, ఎంజాయే చేస్తూ.. ఈత కొడుతున్నారు. కానీ అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదంతో అందరూ ఆగమయ్యారు. ఎందుకంటే పూల్ లోని నీరు వేగంగా సింక్ హోల్ లోకి వెళ్లగా.. ఓ వ్యక్తి అందులో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి అతడిని కాపాడే ప్రయత్నం చేసినా భయంతో వెనక్కి వెళ్లాడు. బాధితుడు సుమారు 43 అడుగుల లోతైన గుంతలో పడిపోయినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తిని సింక్ హోల్ లాక్కెళ్తున్న షాకింగ్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ ఘటన ఇజ్రాయెల్ లోని కర్మీ యోసెఫ్ నగరంలో గురువారం జరిగింది.

Shocking video sink hole forms bottom pool pulls

సింక్ హోల్ తెరుచుకున్న ఈ ఘటనలో మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయ పడినట్లు స్థానిక మీడియా తెలిపింది. మృతుడు 30 ఏళ్ల కిమ్హీగా పోలీసులు గుర్తించారు. అతడిని కాపాడేందుకు యత్నించిన 34 ఏళ్ల వ్యక్తికి స్వల్ప గాయాలు అయినట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో స్విమ్మింగ్ పూల్ లో మొత్తం ఆరుగురు ఉన్నారు. అయితే మిగిలిన వాళ్లు వెంటనే ప్రమాదాన్ని గుర్తించడం వల్ల ఎలాంటి హానీ జరగలేదు.

Advertisement
Exit mobile version