Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Crime News : ఆస్తి కోసం అక్కపై పెట్రోల్ పోసి నిప్పంటించిన చెల్లి… చివరికి ఏమైందంటే ?

shocking-incident-happened-in-medak-district-sisters-financial-rivalry

shocking-incident-happened-in-medak-district-sisters-financial-rivalry

Crime News : సొంత సోదరి పైనే అక్క పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. పుట్టింటి వారి తరఫున వారసత్వంగా సంక్రమించే ఆస్తి కోసం అక్కపై చెల్లెలు పెట్రోలు పోసి నిప్పంటించినట్లుగా గ్రామస్థులు వెల్లడించారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందించగా… పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు.

పోలీసుల కధనం ప్రకారం… కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డికి చెందిన ధర్మగౌని రాజాగౌడ్‌ అనే వ్యక్తికి నలుగురు కూతుర్లు ఉన్నారు. వీరందరికీ గతంలోనే రాజా గౌడ్ పెళ్లిళ్లు చేశాడు. వీరిలో ఒకరైన వరలక్ష్మి వడియారం గ్రామంలోనే ఓ అద్దె ఇంట్లో ఉంటుంది. అయితే రాజా గౌడ్‌కు ఐదెకరాల భూమి ఉండగా అది వారసత్వం కింద నలుగురు కూతుర్లకి చెందుతుంది.

ఇలా పుట్టింటికి చెందిన అయిదెకరాల పంపకం విషయంలో అక్కాచెల్లెళ్ల మధ్య కొన్నాళ్లుగా వివాదం జరుగుతూ వస్తోంది. ఈ క్రమం లోనే సోమవారం వరలక్ష్మి సోదరి రాజేశ్వరి వడియారం లోని ఆమె ఇంటికి వచ్చారు. వారిద్దరి మధ్య ఎప్పటిలాగే ఆస్తి విషయంలో వాగ్వాదం చెలరేగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన రాజేశ్వరి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను అక్క వరలక్ష్మిపై పోసి నిప్పంటించింది.

Advertisement
shocking-incident-happened-in-medak-district-sisters-financial-rivalry

మంటల తోనే ఉన్న వరలక్ష్మి వెళ్లి చెల్లెలు రాజేశ్వరిని గట్టిగా పట్టుకుంది. దీంతో ఇద్దరూ గాయపడ్డారు ఇంట్లోనే ఉన్న వరలక్ష్మి పిల్లలు కేకలు వేయడంతో స్థానికులు హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పివేశారు. వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించగా… వారు సకాలంలో వచ్చి బాధితులను ఆస్పత్రికి చేర్చారు.

తీవ్రంగా గాయపడిన వరలక్ష్మిని హైదరాబాద్‌‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరో ప్రైవేటు అంబులెన్స్‌లో రాజేశ్వరిని తూప్రాన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి ఉస్మానియాకు తీసుకెళ్లారు. ఆస్తి తగాదాల విషయంలో సొంత అక్కా చెల్లెళ్ల మధ్యనే చంపుకునే ప్రయత్నాల వరకూ వెళ్లడంతో అందరూ అవాక్కవుతున్నారు.

Read Also : మీ ఇంట్లో ఇవి ఉంటే.. అన్నీ శుభాలే.. చేతి నిండా డబ్బు..!

Advertisement
Exit mobile version