Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Bath Video : ఈ ముసలోడు మాములోడు కాదు.. కోడలు, మనవరాలు స్నానం చేస్తుండగా పాడుపని..!

rajasthan-old-man-records-bath-videos-of-bathing-daughter-in-law-and-grand-daughter

rajasthan-old-man-records-bath-videos-of-bathing-daughter-in-law-and-grand-daughter

Bath Video : వయస్సుకు ముసలోడే.. కానీ, చేసేవన్నీ పాడుపనులు.. వావివరుసల్లేవు.. కొడుకు భార్యపై కన్నేశాడు.. అంతటితో ఆగలేదు.. కొడుకు కూతురైన మనవరాలిపై కూడా పాడు కన్ను పడింది. కొడుకు చనిపోయాక ఈ మామలోని కామంధుడు బయటకు వచ్చాడు. కోడలతో బయటకి మంచి.. లోపల మాత్రం కీచకుడు.. భర్త చనిపోయాక కోడలు కూతురితో ఇంట్లోనే ఉండేది.

తండ్రి స్థానంలో ఉండి కోడలి బాగోగులు చూడాల్సిన ఈ కీచక మామ.. పాడుబుద్ధిని బయటపెట్టాడు. బాత్ రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టి కోడలు, మనవరాలు స్నాన్నం చేస్తుండగా నగ్న వీడియోలను రికార్డు చేశాడు. ఇంట్లో నుంచి కోడలు, మనవరాలిని బయటకు పంపించేందుకు ఈ పాడుపనులు చేస్తున్నాడు.

నగ్న వీడియోలను వారికి చూపించి ఇంట్లో నుంచి బయటకు వెళ్లకపోతే సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించసాగాడు. తన బాధను చెప్పుకునేవారు లేక తనలోనే తాను కుమిలిపోయింది. అతడి టార్చర్ భరించలేక చివరికి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also :  Skeleton Mystery : ఆ అపార్ట్‌మెంటులో సోదరుడి అస్థిపంజరంతో చిన్నారులు.. చంపింది తల్లేనా?

Advertisement
Exit mobile version